ఆలూరుకృష్ణప్రసాదు .
ఇడ్లీ దోశెలలోకి చాలా చాలా సింపుల్ గా అయిదు నిముషాల్లో తయారయ్యే మరో వెరైటీ పచ్చడి .
తయారీ విధానము .
మూడు స్పూన్లు పండు మిరపకాయల కారం ( కొరివి కారం ) నిల్వ పచ్చడి మీక్సీ లో వేసుకోండి .
అందులో ఒక పెద్ద నిమ్మకాయ మధ్యకు తరిగి నిమ్మరసం పిండండి .
మిక్సీ లో మెత్తగా వేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి .
స్టౌ మీద పోపు గరిట పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసి వరుసగా రెండు ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి , స్పూను మినపప్పు , అర స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ మరియు కాస్త కరివేపాకు వేసి పోపు పెట్టుకోండి .
అంతే . సింపుల్ గా అయిదు నిముషాల్లో తయారయ్యే పుల్ల పుల్లగా నోరూరించే పండు మిరపకాయల చట్నీ ఇడ్లీ మరియు దోశెలలోకి సిద్ధం .
0 comments:
Post a Comment