దబ్బకాయ ఊరగాయ .
ఆలూరుకృష్ణప్రసాదు .
కావలసినవి .
పెద్ద సైజు దబ్బకాయలు పసుపుపచ్చ రంగువి . తోలు పల్చగా ఉన్నవి --- 3
మెత్తని ఉప్పు మామూలు ఉప్పు పాకెట్లు విడిగా దొరుకుతాయి పచ్చళ్ళకు . మెత్తని మామూలు ఉప్పు కె. జి . రూ. 6 / - ఉంటుంది .
ఒక కె. జి . పాకెట్ కొని అందులో ---- పావు కిలో తీసుకోవాలి .
పసుపు --- ఒక స్పూను .
తయారీ విధానము .
దబ్బకాయలు శుభ్రంగా గుడ్డతో తుడుచు కోవాలి .
రెండు దబ్బకాయలు ముక్కలుగా తరుగుకోవాలి .
ఒక దబ్బకాయ మధ్యకు తరిగి రసం తీసి ఉంచుకోవాలి .
ఒక బేసిన్ లో తరిగిన దబ్బకాయ ముక్కలు , పసుపు, విడిగా తీసిన కాయ రసం మరియు ఉప్పు వేసి చేతితో బాగా కలుపుకొని , ఒక జాడీలో భద్రపరుచుకోవాలి .
ఒక 20 రోజుల పాటు ముక్కలకు ఉప్పు మరియు పులుపు పట్టడానికి అలాగే కదపకుండా ఉంచుకోవాలి .
తర్వాత మేము అవసరమైనప్పుడల్లా కొద్ది కొద్దిగా ముక్కలు రసం తీసి విడిగా కలుపుకుంటాము .
ఆ విధానము .
ఓ అయిదు స్పూన్లు ముక్కలు రసం తీసుకోవాలి .
అందులో రెండు స్పూన్లు కారం వేసుకోవాలి .
అర స్పూను మెంతి పిండి వేసుకోవాలి .
ఉప్పు ముందు వేసాము కనుక మరలా వేయనక్కరలేదు .
కలపకుండా అలాగే ఉంచాలి .
స్టౌ మీద బాండీ పెట్టి అయిదు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగాక నాలుగు ఎండుమిర్చి ముక్కలుగా తుంచి , పావు స్పూను మెంతులు , అర స్పూను ఆవాలు , కొంచెం ఎక్కువగా ఇంగువ వేసి కాగే కాగే నూనె పోపు ముక్కలపై ఉన్న కారం పై పోయాలి .
రెండు నిముషాలు ఆగి స్పూనుతో బాగా కలుపుకోవాలి .
అంతే . నిమ్మకాయ ఊరగాయ కన్నా ఎంతో రుచిగా మరియు ఆరోగ్యంగా ఉండే దబ్బకాయ ఊరగాయ అన్నంలోకి మరియు ఇడ్లీ , దోశెలలోకి సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment