మర మరాల ఉండలు .
ఆలూరుకృష్ణప్రసాదు .
తయారీ విధానము ..
ఒక నూటయాభై గ్రాముల బెల్లం మెత్తని పొడిగా చేసుకోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి ఈ బెల్లపు పొడి వేసి బెల్లము మునిగే వరకు నీళ్ళు పోసుకుని చేతితో పాకం ఉండ మాదిరిగా వచ్చే విధంగా అంటే పళ్ళెంలో నీళ్ళు పోసి అందులో పాకం వేసి చేతితో పట్టుకుంటే ఉండ అయ్యే విధంగా పాకం రాగానే రెండు చెంచాలు నెయ్యి పావు చెంచా యాలకుల పొడి వేసి షుమారుగా పట్టినన్ని బాగా కర కర లాడుతున్న మరమరాలు పోసి , వేడి కొద్దిగా తగ్గగానే చేతికి నెయ్యి రాసుకుని ఉండలు కట్టుకోవాలి .
అంతే పిల్లలు తియ్యగా ఇష్టపడే మరమరాల ఉండలు సిద్ధం .
0 comments:
Post a Comment