ఆలూరుకృష్ణప్రసాదు .
కొత్తిమీర కారం .
తయారీ విధానము .
కొత్తిమీర కారం.
కావలసినవి.
ఎండుమిరపకాయలు బాగా గల గల లాడుతూ ఎండినవి -- 12
పచ్చి మిరపకాయలు -- 10
చింతపండు -- 40 గ్రా
ధనియాలు -- నాలుగు స్పూన్లు
ఉప్పు -- తగినంత
బెల్లం -- 20 గ్రా
పసుపు -- పావు స్పూను
కొత్తిమీర -- మూడు కట్టలు మరి కాస్త ఎక్కువగా .
ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచి .
పోపుకు .
ఎండుమిరపకాయలు - 2
పొట్టు మినపప్పు -- స్పూను
ఆవాలు --- అర స్పూను
ఇంగువ --- కొద్దిగా
నూనె --- మూడు స్పూన్లు
తయారీ విధానము .
ముందు చింతపండు విడదీసి చాలా కొంచెం నీళ్ళలో తడిపి ఉంచుకోవాలి.
కొత్తిమీర ఎక్కువ మోతాదులో తీసుకొని క్రింద కాడలు తీసి కడిగి శుభ్రం చేసుకోవాలి .
అన్నీ కూడా వేయించ కుండా అలాగే వేసుకోవాలి.
ముందుగా ఎండుమిరపకాయలు , ధనియాలు , ఉప్పు వేసి మిక్సీ లో పచ్చడి మెత్తగా వేసుకోవాలి .
తరువాత తడిపిన చింతపండు , పచ్చిమిరపకాయలు ( తొడిమలు తీసి కడిగి అలాగే వేసుకోవాలి ) బెల్లం , పసుపు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత మొత్తం కొత్తిమీర అంతా వేసి మరీ మెత్తగా కాకుండా పచ్చడి మిక్సీ వేసుకోవాలి .
కొత్తిమీర , పచ్చి మిరపకాయలు లో తడి ఉంటుంది కనుక నీళ్ళు పోయక్కరలేదు చేసేటప్పుడు .
మరీ గట్టిగా అన్పిస్తే నీళ్ళు చేత్తో చిలకరిస్తే సరిపోతుంది .
తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండి పెట్టి నూనె వేసి నూనె కాగగానే ఎండు మిర్చి , మినపప్పు , ఆవాలు , ఇంగువ తో పోపు పెట్టుకొని స్పూను తో బాగా కలుపుకోవాలి .
అంతే వెరైటీ కొత్తిమీర కారం సిద్ధం.
ఈ కొత్తిమీర కారం ఇడ్లీ , దోశెలు, పూరీలు , చపాతీలు మరియు భోజనము లోకి కూడా చాలా బాగుంటుంది .
సంబంధిత రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .
0 comments:
Post a Comment