ఆలూరుకృష్ణప్రసాదు .
కొబ్బరి దోశెలు.
కావలసినవి .
బియ్యము -- కప్పు.
మినపగుళ్ళు -- పావు కప్పు.
పచ్చి కొబ్బరి చిప్ప -- ఒకటి
ఉప్పు -- తగినంత
నూనె - పావుకప్పు .
తయారీ విధానము .
ముందుగా బియ్యము మరియు మినపగుళ్ళు ఒక గిన్నెలో పోసుకుని నాలుగు గంటల సేపు నానబెట్టు కోవాలి .
పచ్చి కొబ్బరిని చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి .
తరువాత నానబెట్టిన బియ్యము మినపగుళ్ళు గ్రైండర్ లో వేసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకుని మెత్తగా దోశెల పిండి మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి .
అందులోనే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని దోశెల పిండి మాదిరిగా గ్రైండ్ చేసుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
ఆ పిండిలో తగినంత ఉప్పు కలుపుకుని గరిటెతో బాగా కలుపుకుని , ఒక గంట సేపు పిండిని బయట ఉంచుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద పెనం పెట్టుకుని , పెనం బాగా వేడెక్కగానే నూనె వేసుకుని పల్లగా దోశెల మాదిరిగా పోసుకోవాలి .
ఈ కొబ్బరి దోశెలు కొబ్బరి చట్నీ లేదా అల్లపు చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి .
సంబంధించిన రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.
0 comments:
Post a Comment