ఆలూరుకృష్ణప్రసాదు .
పెద్ద చిక్కుడు కాయ ఉల్లిపాయ కూర.
సాధారణంగా అందరూ పెద్ద చిక్కుడు కాయలు ఉడక పెట్టిన కూర మరియు వంకాయతో కలిపి కూరగా చేస్తారు.
చిక్కుడు కాయలు మరియు ఉల్లిపాయలు కలిపి చేసే కూర కూడా చాలా బాగుంటుంది .
కావలసినవి .
చిక్కుడు కాయలు - 200 గ్రాములు .
పెద్ద ఉల్లిపాయలు - మూడు లేదా 150 గ్రాములు.
నూనె - నాలుగు స్పూన్లు .
జీలకర్ర కారం -- స్పూనున్నర .
జీలకర్ర కారం అంటే స్పూను జీలకర్ర , స్పూనున్నర కారం మరియు కొద్దిగా ఉప్పు కలిపి మిక్సీ లో లేదా రోటిలో మెత్తగా దంపు కోవాలి .
ఉప్పు -- తగినంత .
పసుపు -- కొద్దిగా .
తయారీ విధానము .
ముందుగా పెద్ద చిక్కుడు కాయలు ఒకసారి కడిగి శుభ్రం చేసుకుని కొద్దిగా ఆరనిచ్చి కాయకు రెండు వైపులా ఉన్న ఈ నెలు తీసి వేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి .
ఉల్లిపాయలు మరీ చిన్నవిగా కాకుండా ఒక మాదిరి ముక్కలుగా తరుగు కోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె వేసి నూనె బాగా కాగగానే ముందుగా సిద్ధంగా ఉంచుకున్న చిక్కుడు కాయలు , కొంచెం పసుపు మరియు కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి మీడియం సెగన ఓ ఎనిమిది నిముషాలు ముక్కలను బాగా మగ్గ నివ్వాలి.
తర్వాత అందులోనే ఉల్లిపాయల ముక్కలు కూడా వేసి మధ్య మధ్యలో అట్లకాడతో కదుపుతూ మరో ఎనిమిది నిముషాలు చిక్కుడు ముక్కలు మరియు ఉల్లిపాయల ముక్కలను పూర్తిగా మగ్గనివ్వాలి .
తర్వాత స్పూనున్నర కారం వేసి మూత తీసి మరో మూడు నిముషాలు మగ్గనిచ్చి దింపి వేరే ప్లేటు లోకి తీసుకోవాలి .
అంతే చపాతీలు మరియు భోజనము లోకి ఎంతో రుచిగా ఉండే చిక్కుడు కాయ ఉల్లిపాయల కూర సర్వింగ్ కు సిద్థం .
సంబంధించిన రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .
0 comments:
Post a Comment