ఆలూరుకృష్ణప్రసాదు .
కొబ్బరి ఉండలు .
ఈ ఉండలు తయారు చేయడానికి మేము అనకాపల్లి కుండ బెల్లము వాడాము .
అందువల్లనే ఉండలు రంగు అలా వచ్చింది .
రుచి కూడా చాలా బాగుంటుంది .
ఆ బెల్లం దొరకదు కనుక మామూలు బెల్లము తో చేసుకోవచ్చు .
కావలసినవి .
ఎండు కొబ్బరి -- రెండు పెద్ద చిప్పలు .
బెల్లం -- పావు కిలో .
నెయ్యి -- నాలుగు స్పూన్లు .
తయారీ విధానము .
ముందుగా ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి , నెయ్యి బాగా కాగగానే తరిగిన ఎండు కొబ్బరి ముక్కలను వేసి బంగారు రంగులో వేయించు కోవాలి .
వేయించిన ముక్కలను విడిగా పళ్ళెం లోకి తీసుకోవాలి .
ఇప్పుడు బెల్లంను తరుగు కోవాలి లేదా మెత్తగా దంపుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి తరిగిన బెల్లం వేసి , అర గ్లాసు నీళ్ళు పోసి బెల్లం ఉండ పాకం వచ్చాక వేయించిన కొబ్బరి ముక్కలను వేసి అట్లకాడతో బాగా కలుపుకోవాలి .
తర్వాత ఒక ప్లేటులో స్పూను నెయ్యి వేసి ప్లేటంతా రాసి , పాకం పట్టిన ముక్కలను ప్లేటులో వేసుకుని , చెయ్యి పట్టే వేడి లో ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండలుగా కట్టుకోవాలి .
అంతే.
ఎంతో రుచిగా ఉండే కొబ్బరి ఉండలు సిద్ధం.
ఈ కొబ్బరి ఉండలు వారం రోజులు నిల్వ ఉంటాయి .
సంబంధించిన రెసిపీ మరియు ఫోటోలు నా స్వంతం .
0 comments:
Post a Comment