ఆహా !! ఏమి రుచి .
ప్రియమిత్రులందరికీ
ఆలూరుకృష్ణప్రసాదు .
మామిడి కాయతో ముక్కల పచ్చడి .( మెంతి బద్దలు )
కావలసినవి .
పుల్లని పచ్చి మామిడి కాయ -- ఒకటి .
పై చెక్కు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .
ముక్కలను విడిగా ప్లేటులోకి తీసుకుని పైన కొద్దిగా పసుపు వేసుకోవాలి .
నూనె -- నాలుగు స్పూన్లు
ఎండుమిరపకాయలు - 12
మెంతులు -- స్పూను
ఆవాలు -- స్పూను
ఇంగువ -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
పసుపు -- కొద్దిగా
తయారీ విధానము .
స్టౌ మీద బాండీ పెట్టుకొని మొత్తము నూనె పోసి నూనె బాగా కాగగానే ముందుగా మెంతులు మరియు ఎండుమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి .
తర్వాత అందులోనే ఆవాలు మరియు ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి.
పోపు చల్లారగానే ముందుగా మిక్సీ లో వేయించిన పోపు మరియు తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
తీపి ఇష్టమైన వారు చిన్న బెల్లం ముక్క మిక్సీ లో వేసుకుని మిక్సీ వేసుకోవచ్చును,
ఆ తర్వాత మామిడి కాయ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి ముక్కలు నలగకుండా మిక్సీ వేసుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
అంతే. భోజనము లోకి , చపాతీల లోకి , రోటీల లోకి మరియు దోశెల లోకి ఎంతో రుచిగా ఉండే మామిడి కాయ ముక్కల పచ్చడి సర్వింగ్ కు సిద్ధం.
ఈ ముక్కల పచ్చడినే మెంతి బద్దలు అని కూడా అంటారు .
బెల్లం వేయకపోతే ఒక వారం , వేస్తే నాలుగు రోజులు ఈ ముక్కల పచ్చడి నిల్వ ఉంటుంది .
సంబంధించిన రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.
మరిన్ని రుచికరమైన వంటలకు ఆహా !! ఏమి రుచి బ్లాగ్ ను దర్శించండి .
0 comments:
Post a Comment