ఆలూరుకృష్ణప్రసాదు .
టమోటో రసము .
తయారీ విధానము .
ఒక గిన్నెలో మూడు గ్లాసులు నీళ్ళు పోయండి .
అందులో నిమ్మకాయంత చింతపండు వేయండి.
తగినంత ఉప్పు వేయండి . రెండు పచ్చి మిరపకాయలు తుంపి అందులో వేయండి .
రెండు రెమ్మలు కరివేపాకు దూసి అందులో వేయండి . రెండు టమోటో లు ముక్కలుగా తరిగి వేయండి . కొద్దిగా పసుపు వేయండి .
మిక్సీ లో మూడుస్పూన్ల ధనియాలు , మూడు ఎండుమిరపకాయలు , స్పూను జీలకర్ర , పదిహేను మిరియాలు , స్పూనున్నర పచ్చిశనగపప్పు , స్పూను కందిపప్పు బాండీలో వేసి నూనె వేయకుండా ఒట్టి బాండీలో మరీ ఎర్రగా కాకుండా వేయించుకోండి .
తర్వాత అందులో కొద్దిగా ఇంగువ వేసి మిక్సీ లో మెత్తగా పొడి చేసుకోండి .
ఈ పొడిని ఒక సీసాలో భద్ర పరచుకోండి .
రెండు మూడు సార్లు రసము పెట్టుకున్నప్పుడు వాడుకోవచ్చును.
ఇప్పుడు స్టౌ మీద అన్నీ వేసి సిద్ధంగా ఉంచుకున్న రసము పెట్టి బాగా తెర్ల నివ్వండి.
అందులో మనము సిద్ధం చేసుకున్న రసము పొడి రెండు స్పూన్లు వేసి మరో మూడు నిముషములు తెర్ల నిచ్చి దింపుకుని , అందులో కొత్తిమీర తుంపి వేసుకోండి.
ఇప్పుడు స్టౌ మీద పోపు గరిటె పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే ముందుగా పావు స్పూనులో సగం మెంతులు వేయండి. తర్వాత రెండు ఎండుమిర్చి ముక్కలుగా తరిగి వేయండి. పావు స్పూన్ జీలకర్ర , పావు స్పూను ఆవాలు మరియు కొద్దిగా ఇంగువ వేసి పోపు పెట్టుకుని , వేగిన పోపు రసము లో వేసుకుని గరిటతో బాగా కలుపుకోండి .
ఇల్లంతా ముక్కుపుటాలదిరిపోయే ఇంగువ వాసలతో టమోటో రసము సర్వింగ్ కు సిద్ధం .
సంబంధించిన రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .
0 comments:
Post a Comment