ఆలూరుకృష్ణప్రసాదు .
సింపుల్ గా స్వీట్ పొంగలి .
ఒక గిన్నెలో గ్లాసు బియ్యం , పావు కప్పు చాయపెసరపప్పు కడిగి తగినన్ని నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టుకోండి .
అన్నం పూర్తిగా ఉడకగానే అర లీటరు కాచిన పాలు అందులో పోయండి .
షుమారు ఓ 150 గ్రాముల బెల్లం పొడిగా చేసి ఉడుకుతున్న పాలు బెల్లం లో వేయండి.
మరో స్టౌ మీద బాండీ పెట్టి నాలుగు స్పూన్లు నెయ్యి వేసి
ముందు పది జీడిపప్పు లు , కిస్ మిస్ వేయించి పక్కన పెట్టుకోండి .
నాలుగు యాలకులు పొడిగా చేసి ఉడుకుతున్న పొంగలి లో వేయండి.
పావు చిప్ప ఎండు కొబ్బరి చిన్న ముక్కలు గా Cut చేసుకుని బాండీలో ఉన్న నేతిలో బాగా వేయించుకుని నేతితో సహా ఉడుకుతున్న పాయసంలో వేసి బాగా అంతా కలిసేలా ఉడకనివ్వండి.
మూడు స్పూన్లు నెయ్యి వేసి దింపుకుని పైన వేయించిన జీడిపప్పు తో అలంకరించుకోండి .
అంతే స్వీట్ పొంగలి సిద్ధం.
0 comments:
Post a Comment