ఆలూరుకృష్ణప్రసాదు .
మాగాయ ఉల్లిపాయ పెరుగు పచ్చడి.
****************************
తయారుచేయు విధానము .
ఒక గిన్నెలో నాలుగు స్పూన్లు మాగాయ పచ్చడి తీసుకోండి .
స్టౌ మీద గిన్నెలో ఓ అర గ్లాసు నీళ్ళు పెట్టుకొని ఆ నీళ్ళు బాగా మరగనిచ్చి , గిన్నెలో తీసుకున్న మాగాయలో కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుని , చేయి కాలుతుంది కాబట్టి గరిటతో కలుపుకోండి.
దోశెలలోకి కాబట్టి మరీ పల్చగా అక్కరలేదు .గట్టిగానే కలపండి.
వేడి నీళ్ళు పోస్తే పచ్చడి రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది.
ఇప్పుడు మూడు పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా తరుగుకోండి .
అయిదు పచ్చి మిరపకాయలు కూడా ముక్కలుగా తరుగుకోండి.
ఇప్పుడు మిక్సీలో పచ్చిమిర్చి , మాగాయ పచ్చడి మరియు రెండు గరిటల పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని వేరే గిన్నెలోకి తీసుకోండి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నెయ్యి వేసుకుని మూడు ఎండు మిర్చి ముక్కలుగా చేసి , స్పూనున్నర పచ్చిశనగపప్పు , స్పూను మినపప్పు , అరస్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ , రెండు రెమ్మలు కరివేపాకు వేసి పోపు పెట్టుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మూతపెట్టి ఉల్లిపాయలను బాగా మగ్గ నివ్వాలి .
ఉప్పు తగ్గితే కొంచెం కలుపుకోండి.
ఈ మగ్గిన ఉల్లిపాయలు పోపుతో సహా పచ్చడిలో వేసుకుని గరిటె తో బాగా కలుపుకోండి.
అంతే ఉల్లిపాయ మాగాయ పెరుగు పచ్చడి భోజనము లోకి, చపాతీలు, రోటీలు మరియు దోశెల లోకి సర్వింగ్ కు సిద్ధం.
సంబంధిత రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .
0 comments:
Post a Comment