ఆలూరుకృష్ణప్రసాదు .
బెండకాయలతో పచ్చడి .
కూరకు అంతగా పనికి రాని ఓ మాదిరి బెండ కాయలను ఇలా పచ్చడి చేసుకోండి .
మరీ ముదురు కాయలు పచ్చడికి పనికి రావు.
బెండకాయలు -- 250 గ్రాములు.
ఎండుమిరపకాయలు -- ఎనిమిది
నూనె -- నాలుగు స్పూన్లు
మినపప్పు -- స్పూనున్నర
ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా
కొత్తిమీర -- ఒక కట్ట
ఉప్పు -- తగినంత
పసుపు -- కొద్దిగా
చింతపండు -- మూడు రెబ్బలు .
తయారీ విధానము .
ముందుగా బెండకాయలు ముచికలను తీసి కాస్త పెద్ద ముక్కలుగా తరుగు కొవాలి .
బాండీలో రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే ఈ బెండకాయ ముక్కలను వేసి , ముక్కలపై కొద్దిగా పసుపు వేసి ముక్కల పైన మూత పెట్టి మగ్గనిచ్చి తర్వాత వేరే ప్లేటులో తీసుకోవాలి .
తర్వాత తిరిగి స్టౌ మీద బాండీ పెట్టి మరో రెండు స్పూన్లు నూనె వేసి , నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు , మినపప్పు , ఆవాలు మరియు ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి .
తర్వాత మిక్సీలో ముందుగా వేగిన ఎండుమిరపకాయలు చింతపండు రెబ్బలు మరియు ఉప్పు వేసి పచ్చడి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత వేయించిన బెండ కాయ ముక్కలు , మిగిలిన పోపు మరియు కొత్తిమీర కూడా వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత వేరే గిన్నె లోకి తీసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే బెండకాయ పచ్చడి సర్వింగ్ కు సిద్ధం .
సంబంధిత రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.
0 comments:
Post a Comment