ఆలూరుకృష్ణప్రసాదు .
కందిపప్పు , పచ్చిశనగపప్పు మరియు చాయపెసరపప్పు మూడు కలిపిన పచ్చడి .
కావలసినవి .
కందిపప్పు - ఒక కప్పు
పచ్చిశనగపప్పు - అర కప్పు
చాయపెసరపప్పు - పావు కప్పు
ఎండుమిరపకాయలు - 12
నూనె - మూడు స్పూన్లు
జీలకర్ర - ముప్పావు స్పూను
ఇంగువ - కొద్దిగా
చింతపండు - చిన్న నిమ్మకాయంత
పసుపు -- కొద్దిగా
ఉప్పు - తగినంత
తయారీ విధానము .
ముందుగా చింతపండు విడదీసి కొద్దిగా నీళ్ళతో తడిపి ఉంచుకోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె వేసి నూనె బాగా కాగగానే , ముందుగా కందిపప్పు , పచ్చిశనగపప్పు , ఎండుమిరపకాయలు మరియు జీలకర్రను వేసి పప్పును సగం వేగనివ్వాలి .
తర్వాత అందులో చాయపెసరపప్పు మరియు ఇంగువ వేసి పప్పులను పూర్తిగా కమ్మని వాసన వచ్చేదాకా వేగనివ్వాలి .
చల్లారగానే ముందుగా ఎండుమిరపకాయలు , పసుపు మరియు ఉప్పును మిక్సీ లో వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత మిగిలిన పప్పులు మరియు తడిపిన చింతపండును వేసి , కొద్దిగా నీళ్ళు పోసుకుని మరీ మెత్తగా కాకుండా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత వేరే గిన్నెలో కి తీసుకోవాలి .
తర్వాత స్టౌ మీద పోపు గరిటె పెట్టి , రెండు స్పూన్లు నెయ్యి వేసి రెండు ఎండుమిర్చి ముక్కలుగా చేసి , చాయమినపప్పు అర స్పూను , ఆవాలు పావు స్పూను , కరివేపాకు రెండు రెమ్మలు తో పోపు పెట్టుకుని స్పూను తో కలుపు కోవాలి.
ఈ పచ్చడి ఇడ్లీ , దోశెలు, చపాతీలు , రోటీలు మరియు భోజనము లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది .
సంబంధించిన రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .
0 comments:
Post a Comment