ఆలూరుకృష్ణప్రసాదు .
దోసకాయ మామిడి కాయ ముక్కలతో పచ్చడి .
కావలసినవి .
పసుపు రంగు గట్టి దోసకాయ --- ఒకటి.
పై చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .
పుల్లని మామిడి కాయ -- ఒకటి .
పై చెక్కు తీసుకుని మాగాయ ముక్కలు మాదిరిగా తరుగు కోవాలి .
పచ్చిమిరపకాయలు -- 10
కొత్తి మీర --- రెండు కట్టలు .
మరి కాస్త వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది .
కట్టలు విడదీసి కాడలు తీసేసి కొత్తిమీర శుభ్రం చేసుకోవాలి .
ఉప్పు --- తగినంత
పసుపు --- కొద్దిగా .
పోపుకు .
ఎండుమిరపకాయలు -- 8
మినపప్పు --- స్పూనున్నర
మెంతులు --- పావు స్పూను
ఆవాలు --- అర స్పూను
ఇంగువ --- కొద్దిగా
నూనె --- 50 గ్రాములు
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి మొత్తం నూనె పోయాలి.
నూనె బాగా కాగనివ్వాలి .
నూనె బాగా కాగగానే ముందుగా మెంతులు వేసి బాగా వేగాక ఎండుమిరపకాయలు , మినపప్పు , ఆవాలు మరియు ఇంగువ వేసి పోపు బాగా వేగనివ్వాలి .
ఎక్కువ నూనె బాండీలో మిగిలి ఉంటే ఆఖరున పచ్చడిలో కలుపుకోవచ్చు.
బాండీ లోనే ఉంచేయండి
పోపు చల్లారగానే ముందుగా మిక్సీ లో ఎండుమిరపకాయలు , తగినంత ఉప్పు మరియు పసుపు వేసి మెత్తగా మిక్సీ వేసుకోండి.
తరువాత పచ్చిమిర్చి , మామిడి కాయ ముక్కలు మరియు పోపు వేసి మెత్తగా మిక్సీ వేసుకోండి .
చివరగా దోసకాయ ముక్కలు మరియు కొత్తిమీర వేసి దోసకాయ ముక్కలు నలగ కుండా ఒకే ఒక్కసారి మిక్సీ వేసుకోండి.
తర్వాత ఈ పచ్చడి ఒక గిన్నెలోకి తీసుకుని బాండీలో కాగిన మిగిలిన నూనె అందులో పోసి గరిటతో ముక్కలు పచ్చడి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే దోసకాయ మరియు మామిడి కాయ ముక్కలతో పచ్చడి సర్వింగ్ కు సిద్ధం .
సంబంధిత రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .
0 comments:
Post a Comment