ఆలూరుకృష్ణప్రసాదు .
బెండకాయలు కాయల పళంగా .
అయిదు నిముషాలలో తయారయ్యే కూర .
తయారీ విధానము .
మూడు స్పూన్లు మామూలు కారంలో ముప్పావు స్పూను జీలకర్ర మరియు తగినంత ఉప్పు వేసి వేరే ప్లేటులోకి తీసుకోండి .
ఓ పది లేత చిన్న బెండకాయలు శుభ్రంగా కడిగి చాకుతో మధ్యలో గాటు పెట్టుకోండి .
మీరు గిన్నెలో అన్నం వండుతున్నప్పుడు , అన్నం ఉడికి దగ్గర పడగానే సిద్ధంగా ఉంచిన బెండకాయలు ముచికలు బయటకు కనిపించేలా ఉడుకుతున్న అన్నంలో గుచ్చి మూత పెట్టండి .
అన్నం పూర్తిగా ఉడికి దింపగానే ఆవిరి మీద ఉడికిన బెండకాయలను ఒక పళ్ళెం లోకి తీసుకుని , కాయలలో సిద్ధంగా ఉంచుకున్న కారం కూరుకోండి .
స్టౌ మీద బాండీ పెట్టి అయిదు స్పూన్లు నూనె వేసి నూనె పొగలు వచ్చే విధముగా కాగ నివ్వండి .
ఈ కాగే నూనె స్పూనుతో కారం కూరిన కాయలలో పోయండి .
అంతే వేడి వేడిగా తయారైన అన్నం లోకి బెండకాయ కాయల పళంగా అయిదు నిముషాల్లో తయారైన Instant కూర సిద్ధం.
సంబంధించిన రెసిపీ మరియు ఫోటొ నా స్వంతం .
0 comments:
Post a Comment