ఆలూరుకృష్ణప్రసాదు .
ఉసిరి ఆవకాయ . ( నిల్వ ఊరగాయ )
కావలసినవి .
పెద్ద ఉసిరి కాయలు -- రెండు కిలోలు.
ఎండు కారం -- 400 గ్రాములు.
ఆవపిండి -- 350 గ్రాములు
ఉప్పు మెత్తనిది - 300 గ్రాములు
పసుపు -- రెండు స్పూన్లు
ఎండుమిరపకాయలు - 15
నూనె -- 600 గ్రాములు
ఆవాలు -- మూడు స్పూన్లు
ఇంగువ -- స్పూను.
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి 200 గ్రాముల నూనె వేసి నూనె బాగా కాగగానే ఉసిరికాయలు వేసి మూత పెట్టి పది హేను నిముషాలు పాటు మగ్గనివ్వాలి .
తర్వాత మూత తీసి మరో అయిదు నిముషాలు నీరు తడి లేకుండా ఇగర నివ్వాలి .
తర్వాత మగ్గ పెట్టి సిద్ధంగా ఉంచుకున్న కాయలపై పై పసుపు, కారం , ఆవపిండి , మెత్తని ఉప్పు ఒక బేసిన్ లో వేసి నాలుగు మూలలా చేతితో బాగా కలుపు కోవాలి .
మళ్ళీ స్టౌ మీద బాండీ పెట్టి మిగిలిన మొత్తము నూనె వేసి నూనెను బాగా కాగనివ్వాలి .
బాగా కాగిన నూనెలో ఎండుమిరపకాయలు , ఆవాలు , ఇంగువ ( మరి కాస్త ) వేసి పోపు వేగాక చల్లారనిచ్చి ఆ నూనెను ముక్కల లో పోసి గరిటతో బాగా కలుపుకోవాలి.
చల్లారగానే ఒక జాడి లోకి తీసుకోవాలి .
వాడుకునే టప్పుడు చిన్న గిన్నెలలోకి అవరమైన పచ్చడి తీసి వాడుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది .
అంతే ముక్కుపుటాలు అదిరిపోయే ఇంగువ వాసనతో ఉసిరికాయతో ఆవకాయ సర్వింగ్ కు సిద్ధం.
ఈ పచ్చడి నాలలుగు నెలల పైన నిల్వ ఉంటుంది .
0 comments:
Post a Comment