ఆలూరుకృష్ణప్రసాదు .
ఆనపకాయ పల్లీ పొడి కూర .
కావలసినవి .
లేత ఆనపకాయ ముక్క --
షుమారు 400 గ్రాములు
పల్లీలు -- 100 గ్రాములు .
షాపుల్లో వేయించిన పల్లీ గింజలు విడిగా అమ్ముతారు .
ఆ పల్లీలు తెచ్చుకుని పై పొట్టు తీసేసుకోవాలి .
ఎండుమిరపకాయలు - 8
జీలకర్ర -- స్పూను
ఉప్పు -- తగినంత
పోపునకు .
నూనె -- నాలుగు స్పూన్లు
ఎండుమిరపకాయలు - 3
ముక్కలుగా చేసుకోవాలి .
చాయమినపప్పు - స్పూను
ఆవాలు -- స్పూను
కరివేపాకు - మూడు రెమ్మలు .
తయారీ విధానము .
ముందుగా సొరకాయ పై చెక్కు తీసి దోసకాయ పచ్చడికి ముక్కలు తరిగినట్లుగా తరుగు కోవాలి .
ముక్కలను ఒక గిన్నెలో వేసి మునిగే వరకు నీరు పోసి కొద్దిగా ఉప్పువేసి స్టౌ మీద పెట్టి ముక్కలను మెత్తగా ఉడికించి నీరు వడకట్టు కోవాలి .
వేరే ప్లేటులోకి తీసుకోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి నూనె వేయకుండా పొట్టు తీసిన పల్లీలు , ఎండుమిరపకాయలు , జీలకర్ర మీడియం సెగన వేయించుకోవాలి .
చల్లారగానే మిక్సీ లో వేసుకుని అందులో తగినంత ఉప్పువేసి మెత్తని పొడిగా చేసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె వేసుకుని నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిర్చి ముక్కలు , చాయమినపప్పు , ఆవాలు మరియు కరివేపాకు వేసి పోపు వేయించుకోవాలి .
పోపు వేగగానే ఉడికించి సిద్ధంగా ఉంచుకున్న సొరకాయ ముక్కలను పోపులో వేసి మూత పెట్టి మీడియం సెగలో అయిదు నిముషాలు మగ్గపెట్టాలి .
కూర దింపబోయే మూడు నిముషాల ముందు పల్లీ పొడి వేసి అట్లకాడతో బాగా కలుపుకుని , విడిగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి .
అంతే . ఎంతో రుచిగా ఉండే ఆనపకాయ పల్లీ పొడితో కూర చపాతీల లోకి మరియు భోజనము లోకి సిద్ధం.
సంబంధించిన రెసిపీ మరియు ఫోటో నాస్వంతం.
0 comments:
Post a Comment