ఆలూరుకృష్ణప్రసాదు .
వేడి వేడి గా ఉల్లిపాయ పకోడీలు.
కావలసినవి .
శనగపిండి -- 100 గ్రాములు .
ఉల్లిపాయలు -- 3
( నిలువుగా సన్నగా తరుగు కోవాలి . )
పచ్చిమిరపకాయలు - 4
( సన్నగా తరుగు కోవాలి )
కరివేపాకు -- నాలుగు రెమ్మలు . ( ఆకులు వలుచుకుని సన్నగా తరుగుకోవాలి )
ఉప్పు -- తగినంత .
కారం -- అర స్పూను .
( పచ్చిమిరపకాయల కారం సరిపోతుంది . కారంగా కావాలనుకునే వారు అర స్పూను కారం వేసుకోండి . )
నూనె -- 200 గ్రాములు .
తయారీ విధానము .
ముందుగా ఒక బెసిన్ లో నిలువుగా తరిగిన ఉల్లిపాయలు , సన్నగా తరిగిన పచ్చిమిర్చి , సన్నగా తరిగిన కరివేపాకు , కారంగా ఇష్ట పడే వారు అర స్పూను కారము మరియు తగినంత ఉప్పు వేసుకుని చేతితో నొక్కుతూ బాగా కలుపుకోవాలి . ( పిసకాలి ) . ఉల్లిపాయల నుండి నీరు వచ్చి తడిగా అవుతుంది .
ఇప్పుడు అందులో శనగపిండి వేసి చాలా కొద్దిగా నీరు పోసుకుని గట్టిగా కలుపు కోవాలి.
తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె వేసి , నూనె బాగా పొగలు వచ్చేటట్లు కాగగానే , చిన్న చిన్న పకోడీలు లాగా వేసుకుని చిల్లుల గరిటెతో బాగా కదుపుతూ, పకోడీలు బంగారు రంగులో వేయించుకుని వేరే ప్లేటు లోకి తీసుకోవాలి .
మేము ఇలా చేసుకున్న పకోడీలు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కూర లాగా నంచుకుని తినేస్తాము.
ఈ పకోడీలు మధ్యాహ్నము అల్పాహారానికి చాలా రుచిగా ఉంటాయి .
సంబంధించిన ఫోటో మరియు రెసిపీ నా స్వంతం .
0 comments:
Post a Comment