ఆలూరుకృష్ణప్రసాదు
పచ్చిశనగపప్పు తో పచ్చడి.
********************
తయారీ విధానము .
పది ఎండుమిరపకాయలు , గ్లాసు పచ్చిశనగపప్పు , స్పూను జీలకర్ర మరియు కొద్దిగా ఇంగువ
నూనె వేయకుండా బాండీలో కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకోవాలి .
చల్లారగానే మిక్సీ లో వేయించిన పచ్చిశనగపప్పు , ఎండుమిరపకాయలు , జీలకర్ర మిశ్రమం , మరియు తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
ఎవరి అభిరుచిని పట్టి వారు ఈ క్రింద తెలియ చేసిన విధముగా చేసుకోవచ్చును.
వెల్లుల్లి ఇష్టపడే వారు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పచ్చడిలో వేసుకుని మిక్సీ వేసుకుంటారు .
రెండు రెబ్బలు చింతపండు కూడా మిక్సీ లో పచ్చడిలో వేసి మిక్సీ వేసుకుంటారు.
పచ్చి మామిడి కాయ ముక్కలు అరకప్పు , పచ్చికొబ్బరి పావుకప్పు మరియు మూడు రెబ్బలు కరివేపాకు ను కూడా పచ్చడిలో వేసి మిక్సీ వేసుకుంటారు .
కొంతమంది స్టౌ మీద పోపు గరిటె పెట్టి మూడు స్పూన్లు నెయ్యి వేసి రెండు ఎండుమిర్చి ముక్కలుగా చేసి , మినపప్పు , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పచ్చడిలో పోపు పెట్టుకుంటారు .
మీ అభిరుచి ప్రకారం ఏ విధంగానైనా మార్చి చేసుకోవచ్చును .
0 comments:
Post a Comment