ఆలూరుకృష్ణప్రసాదు .
వంకాయ ముక్కల పచ్చడి .
కావలసినవి .
వంకాయలు -- పావు కిలో .
చింతపండు -- పెద్ద ఉసిరి కాయంత .
విడదీసి కొద్దిగా నీళ్ళలో పది నిముషాల ముందు తడిపి ఉంచుకోవాలి .
పచ్చిమిర్చి - 8
కరివేపాకు -- మూడు రెమ్మలు .
కొత్తిమీర -- చిన్న కట్ట .
పసుపు - కొద్దిగా .
ఉప్పు -- తగినంత
నూనె -- అయిదు స్పూన్లు .
పోపునకు .
ఎండుమిర్చి -- 4
చాయమినపప్పు - స్పూను
ఆవాలు - అర స్పూను .
మెంతులు -- కొద్దిగా
జీలకర్ర -- పావు స్పూను
ఇంగువ -- కొద్దిగా
తయారీ విధానము .
ముందుగా వంకాయలు నీళ్ళలో వేసుకుని పులుసు ముక్కల మాదిరిగా కాస్త పెద్ద ముక్కలు తరుగుకుని నీళ్ళలోనే ఉంచుకోవాలి .
తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే తరిగి సిద్ధంగా ఉంచుకున్న వంకాయ ముక్కలు , పచ్చిమిర్చి మరియు కొద్దిగా పసుపు వేసి మూతపెట్టి మీడియం సెగన ముక్కలను ఓ పది నిముషాలు మగ్గనిచ్చి దింపి వేరే ప్లేటు లోకి తీసుకోవాలి .
ఆ తర్వాత స్టౌ మీద మళ్ళీ బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిర్చి , మెంతులు , చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు వేయించుకోవాలి .
తర్వాత మిక్సీ లో ముందుగా ఎండుమిర్చి ,తడిపిన చింతపండు మరియు తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత మగ్గించి సిద్ధంగా ఉంచుకున్న వంకాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి వేసి మరీ మెత్తగా కాకుండా పచ్చడి మిక్సీ వేసుకోవాలి .
తర్వాత మిగిలిన పోపు మరియు కొత్తిమీర కూడా వేసి ఒకసారి మిక్సీ వేసుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
అంతే . ఎంతో రుచిగా ఉండే వంకాయ పచ్చడి దోశెలు , చపాతీలు మరియు భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం.
సంబంధించిన రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .
0 comments:
Post a Comment