ఆలూరుకృష్ణప్రసాదు .
కొత్తిమీర చట్నీ.
కొత్తిమీర -- ఒక కప్పు.
తురిమిన పచ్చి కొబ్బరి -- ఒక కప్పు.
పచ్చిమిర్చి -- ఎనిమిది .
చింతపండు -- ఉసిరి కాయంత.
ఇంగువ -- కొద్దిగా .
ఉప్పు -- తగినంత .
తయారీ విధానము .
ముందుగా మిక్సీ లో పైన కొత్తిమీర , పచ్చి కొబ్బరి , పచ్చి మిర్చి , చింతపండు , ఇంగువ మరియు తగినంత ఉప్పు వేసుకుని , మరీ మెత్తగా కాకుండా మిక్సీ వేసుకోవాలి .
నూరిన పచ్చడి వేరే గిన్నెలోకి తీసుకోవాలి.
తర్వాత స్టౌ మీద పోపు గరిటె పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే మూడు ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా చేసుకుని , స్పూను మినపప్పు , అర స్పూను ఆవాలు మరియు రెండు రెమ్మలు కరివేపాకు వేసి పోపు వేయించుకుని పచ్చడిలో వేసుకుని స్పూనుతో బాగా కలుపుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర పచ్చడి ఇడ్లీ , దోశెలు , వేడి వేడి పూరీలు మరియు భోజనము లోకి సిద్ధం .
0 comments:
Post a Comment