ధనియాల పొడి .
నోరు అరుచిగా ఉన్నా , జ్వరపడిన వారికి పత్యం పెట్టాలన్నా , బాలింతలకు పథ్యానికి ఈ ధనియాల పొడి ఎక్కువగా పెడతారు .
జలుబు కఫం వంటివి కూడా హరిస్తుంది .
వేడి వేడి అన్నంలో నెయ్యి బాగా వేసుకుని ఈ పొడిని మొదటి ఐటమ్ గా వేసుకుని తింటే ఆరోగ్య రిత్యా చాలా మంచిది .
కడుపులో ఇబ్బందిగా ఉన్నవారికి , గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి కూడా ఈ ధనియాల పొడి వాడటం వలన ఆ ఇబ్బందులు తొలగి పోతాయి .
ధనియాల పొడి తయారీ విధానము .
కావలసినవి .
ఎండుమిరపకాయలు -- 15
ధనియాలు -- 75 గ్రాములు
మినపప్పు -- మూడు స్పూన్లు
చింతపండు -- చిన్న నిమ్మకాయంత
కరివేపాకు -- రెండు రెమ్మలు .
ఉప్పు -- తగినంత
నూనె -- మూడు స్పూన్లు .
తయారీ విధానము .
ముందుగా చింతపండు విడదీసి గింజలు లేకుండా శుభ్రం చేసుకోవాలి .
ధనియాలు పుల్లలు లేకుండా శుభ్ర పరుచు కోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు , మినపప్పు , ధనియాలు , వేసి వేయించుకుని , తర్వాత కరివేపాకు కూడా వేసి కమ్మని వేపు వచ్చే వరకు వేయించుకోవాలి .
చల్లారగానే మిక్సీ లో వేయించిన దినుసులు , చింతపండు మరియు తగినంత ఉప్పు వేసి మెత్తగా పొడిగా వేసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే ధనియాల పొడి సర్వింగ్ కు సిద్ధం .
ఇందులో మెంతులు , ఆవాలు , జీలకర్ర , శనగపప్పు , ఇంగువ వంటివి వెయ్యరు .
వెల్లుల్లి తినే వారు కూడా ఇది కేవలం ధనియాల పొడి కావున వేసుకోపోవడం మంచిది .
ఈ పొడి భోజనము లోకే కాకుండా ఇడ్లీ , దోశెలలోకి కూడా బాగుంటుంది .
0 comments:
Post a Comment