పల్లీలు మరియు పచ్చి కొబ్బరి తో చట్నీ.
తయారీ విధానము .
స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె కాగగానే , అర కప్పు వేయించని పల్లీలు , పావు కప్పు పచ్చిశనగపప్పు , ఆరు పచ్చిమిరపకాయలు వేసి మగ్గ పెట్టు కోవాలి .
చల్లారగానే ఈ మిశ్రమము , ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తురుము మిక్సీ లో వేసుకుని , మూడు రెబ్బలు చింతపండు , తగినంత ఉప్పు వేసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకుని పచ్చడి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
తిరిగి స్టౌ మీద పోపు గరిటె పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని ఎండుమిర్చి ముక్కలు , మినపప్పు , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసుకుని పోపు పెట్టుకోవాలి .
ఈ పచ్చడి ఇడ్లీ , దోశెలు , పూరీలు మరియు భోజనము లోకి రుచిగా ఉంటుంది .
0 comments:
Post a Comment