ఆలూరుకృష్ణప్రసాదు .
పచ్చి కొబ్బరి తురుముతో పెరుగు పచ్చడి.
కావలసినవి.
కొబ్బరి కాయ -- పగుల కొట్టి రెండు చిప్పలూ పచ్చి కొబ్బరి తురుముతో తురుము కోవాలి .
పెరుగు -- అర లీటరు .
పులుపు ఇష్టమైన వారు పుల్లని పెరుగు , పచ్చడి కమ్మగా ఇష్టమైన వారు కమ్మని పెరుగు వాడు కోవచ్చును.
పచ్చి మిరపకాయలు -- 8
అల్లం -- అంగుళం ముక్క ఒకటి
కొత్తిమీర -- చిన్న కట్టలు రెండు .
ఉప్పు -- తగినంత .
పోపునకు.
నెయ్యి -- మూడు స్పూన్లు .
ఎండుమిరపకాయలు 4 ముక్కలుగా చేసుకోవాలి .
చాయమినపప్పు -- స్పూనున్నర .
జీలకర్ర -- పావు స్పూను .
ఆవాలు -- అర స్పూను .
ఇంగువ -- కొద్దిగా
కరివేపాకు -- మూడు రెమ్మలు .
తయారీ విధానము .
పచ్చిమిరపకాయలు తొడిమలు తీసి ఉంచుకోవాలి.
అల్లం చెక్కు తీసి , ముక్కలుగా చేసుకోవాలి .
కొత్తిమీర విడదీసి శుభ్రం చేసుకోవాలి .
ఇప్పుడు మిక్సీ లో పచ్చిమిరపకాయలు , తరిగిన అల్లం ముక్కలు , కొత్తిమీర లో మూడు వంతులు , తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
ఇప్పుడు ఒక గిన్నెలో సిద్ధంగా ఉంచుకున్న పెరుగు , తురిమి ఉంచుకున్న పచ్చి కొబ్బరి తురుము , మిగిలిన ఒక వంతు కొత్తిమీర మరియు మిక్సీ వేసుకున్న మిశ్రమము వేసి గరిటతో బాగా కలుపుకోవాలి.
తర్వాత స్టౌ మీద పోపు గరిట పెట్టి మొత్తము నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయల ముక్కలు, చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు పెట్టి , కొబ్బరి పెరుగు పచ్చడి లో కలుపుకోవాలి .
అద్భుతమైన కొత్తిమీర సువాసనతో రుచిగా ఉండే ఈ కొబ్బరి తురుము పెరుగు పచ్చడి ఇడ్లీ , దోశెలలోకి మరియు భోజనము లోకి కూడా ఎంతో బాగుంటుంది .
ఫోటో --- ఈ రోజు నేను స్వయముగా చేసుకున్న పచ్చి కొబ్బరి తురుము పెరుగు పచ్చడి .
ఎలా ఉందో మీరే చెప్పాలి ?
0 comments:
Post a Comment