Sunday, November 12, 2017

ఉసిరి కాయ ముక్కల ఆవకాయ

ఉసిరి కాయ ముక్కల ఆవకాయ.

కావలసినవి .

పెద్ద ఉసిరి కాయలు  --  అర కిలో.
ఎండు కారం  --  100  గ్రాములు.
ఆవపిండి  --  90 గ్రాములు
ఉప్పు మెత్తనిది  - 80 గ్రాములు
పసుపు  --  ముప్పావు  స్పూను
ఎండుమిరపకాయలు  -  5
నూనె  --  150 గ్రాములు
ఆవాలు  --  స్పూను
ఇంగువ  --  పావు  స్పూను.

ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి  నాలుగు  స్పూన్లు  నూనె వేసి నూనె బాగా కాగగానే  ఉసిరికాయలు వేసి  మూత పెట్టి  పది  నిముషాలు  మగ్గనివ్వాలి .

తర్వాత  మూత తీసి  మరో అయిదు నిముషాలు  నీరు  తడి లేకుండా  ఇగర నివ్వాలి .

ఆ తర్వాత  కొంచెం చల్లారగానే  ఉసిరి కాయలలోని  గింజలను  చేతితో తీసివేసి ముక్కలుగా  చేసుకోవాలి.

తర్వాత  ముక్కల పై  పసుపు, కారం , ఆవపిండి , మెత్తని   ఉప్పు ఒక బేసిన్ లో  వేసి  నాలుగు  మూలలా  చేతితో  బాగా కలుపు కోవాలి .

మళ్ళీ  స్టౌ మీద బాండీ  పెట్టి  మిగిలిన మొత్తము నూనె  వేసి నూనెను  బాగా  కాగనివ్వాలి .

బాగా  కాగిన నూనెలో  ఎండుమిరపకాయలు , ఆవాలు , ఇంగువ (  మరి కాస్త  )  వేసి  పోపు వేగాక  చల్లారనిచ్చి  ఆనూనెను  ముక్కల లో పోసి  గరిటతో  బాగా  కలుపుకోవాలి.

అంతే ముక్కుపుటాలు అదిరిపోయే  ఇంగువ  వాసనతో  ఉసిరికాయతో  ముక్కల  ఆవకాయ  సర్వింగ్  కు  సిద్ధం.

ఈ పచ్చడి  ఒక నెల రోజుల పైన  నిల్వ ఉంటుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి