అయిదు నిముషాల క్రితం ఈ రోజు రాత్రికి భోజనము లోకి కందిపచ్చడి తినాలని అన్పించింది .
మొత్తము ప్రాసెస్ చేసే ఓపిక లేదు .
బుర్రలో తళుక్కుమని ఒక ఆలోచన.
ఇంట్లో మూడు రోజుల క్రితం కొట్టిన కందిపొడి ఉంది.
నాలుగు స్పూన్లు కందిపొడి , పావు స్పూను జీలకర్ర , ముప్పావు స్పూను కారం మరియు తగినంత ఉప్పు మిక్సీ లో వేసి , కొద్దిగా నీళ్ళు పోసి తిప్పేసాను .
రుచి అదిరిపోయింది.
పచ్చడిని చూసి మీరే చెప్పవచ్చు ఎంత రుచిగా ఉందో.
మూడు నిముషాల్లో అయిపోయింది కందిపచ్చడి .
0 comments:
Post a Comment