కొబ్బరి పాలతో రైస్ పొంగల్.
కొబ్బరి పాలు -- ఒక గ్లాసు.
కొబ్బరి కాయను పగుల గొట్టి చిప్పలను పచ్చి
కొబ్బరి కోరాముతో తురుముకుని ఒకసారి మిక్సీ వేసుకుని ఒక గుడ్డలో వేసుకుని
కొబ్బరి పాలు తీసుకోవాలి .
తిరిగి తురుము మరోసారి మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళుపోసి మరోసారి మిక్సీ వేసుకుని తిరిగి పాలు తీసుకోవాలి .
ఈ విధముగా ఒక గ్లాసు కొబ్బరి పాలు తీసుకుని సిద్ధముగా ఉంచుకోవాలి.
చాయపెసరపప్పు -- పావు గ్లాసు . అరగంట ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి.
నెయ్యి - 5 స్పూన్లు
ఉల్లిపాయ -- ఒకటి
టమోటో -- ఒకటి
పచ్చిమిర్చి -- రెండు
కరివేపాకు -- మూడు రెమ్మలు
కొత్తిమీర -- చిన్న కట్ట
పొదినా -- చిన్న కట్ట
లవంగాలు -- 4
మిరియాలు -- 6
జీడిపప్పు -- పది పలుకులు
ఉప్పు -- తగినంత
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద కుక్కర్ పెట్టి అందులో మూడు స్పూన్లు నెయ్యి వేసి జీడిపప్పు , లవంగాలు , మిరియాలు వేయించుకోవాలి .
ఆ తర్వాత అందులో తరిగిన టమోటో ముక్కలు , ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి పైన మూత పెట్టి మగ్గనివ్వాలి.
తర్వాత తరిగిన పొదినా, కరివేపాకు మరియు తరిగిన కొత్తిమీర వేసి కొద్దిసేపు మగ్గనిచ్చి అందులో గ్లాసు కొబ్బరి పాలు మరియు గ్లాసు నీళ్ళు , తగినంత ఉప్పు , గ్లాసు నానబెట్టిన బియ్యము మరియు పావు గ్లాసు నానబెట్టిన పెసర పప్పు వేసి కుక్కర్ మూతపెట్టి విజిల్ పెట్టి మూడు విజిల్స్ రానిచ్చి దింపు కోవాలి .
విజిల్ ఊడి రాగానే మిగిలిన నెయ్యి మొత్తము వేసి గరిటతో బాగా కలుపుకుని, టమోటో మరియు కొత్తిమీర చట్నీతో కాని లేదా అల్లం చట్నీతో కాని సర్వింగ్ చేసుకోవాలి.
0 comments:
Post a Comment