భోజనము లోకి ఆదరువుగా
కంద అట్టు.
తయారీ విధానము .
ఒక అర కిలో కంద పై చెక్కు తీసి ముక్కలుగా తరుగుకోండి .
ఒక పావు కప్పు చాయపెసరపప్పు రెండుగంటలు నానబెట్టుకోండి .
మూడు పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా తరుకోండి .
తర్వాత నీళ్ళు వడగట్టి చాయపెసరపప్పు , తరిగిన కంద ముక్కలు , తరిగిన ఉల్లిపాయల ముక్కలు , అర స్పూను జీలకర్ర , స్పూనున్నర కారం , తగినంత ఉప్పు వేసి పెసరట్లు కు ఎలా మిక్సీ వేసుకుంటామో అలా మిక్సీ వేసుకోండి .
తర్వాత ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని మూడు స్పూన్లు బియ్యపు పిండి కలుపుకుని అవసరమయితే కొద్ది నీళ్ళు పోసుకుని పెనం మీద అట్లు లాగా పోసుకొని నూనె రెండు స్పూన్లు వేసుకుని రెండు వైపులా కాల్చుకోండి .
ఇవి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది .
0 comments:
Post a Comment