ఆలూరుకృష్ణప్రసాదు .
దోసకాయ మరియు బీరకాయ పచ్చడి .
కావలసినవి.
పసుపు పచ్చగా గట్టిగా ఉన్న దోసకాయ -- 1
లేత బీరకాయలు -- రెండు.
పచ్చిమిరపకాయలు -- 8
చింతపండు -- చిన్న నిమ్మకాయంత .
కొత్తిమీర -- ఒక చిన్న కట్ట
పసుపు -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
పోపునకు .
నూనె -- ఐదు స్పూన్లు
ఎండుమిరపకాయలు -- 8
మినపప్పు -- స్పూనున్నర
మెంతులు -- పావు స్పూను
ఆవాలు -- అరస్పూను
జీలకర్ర -- పావు స్పూను
ఇంగువ -- కొద్దిగా
కరివేపాకు -- మూడు రెమ్మలు
తయారుచేయు విధానము .
పదినిముషాల ముందు చింతపండు విడదీసి కొద్దిగా నీళ్ళలో తడిపి ఉంచుకోవాలి .
బీరకాయలు పై చెక్కు తీసుకుని ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి .
దోసకాయ పైన నూనె రాసి స్టౌ వెలిగించి సిమ్ లో సెగను పెట్టి కాయను అన్ని వైపులా కాల్చు కోవాలి .
చల్లారగానే తడి చేతితో పై తొక్కను వలుచుకొని కాయను విడదీసి ఒక పళ్ళెంలో విడిగా పెట్టుకోవాలి .
మరల స్టౌ వెలిగించి బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే బీరకాయ ముక్కలు, కొద్దిగా పసుపు , కొద్దిగా ఉప్పు మరియు పచ్చిమిరపకాయలు కాయలు వేసి మూతపెట్టి బీరకాయలను బాగా మగ్గనివ్వాలి .
తరువాత వాటిని వేరే ప్లేటులో తీసుకోవాలి .
మరల స్టౌ వెలిగించి బాండి పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు , మెంతులు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి .
పోపు చల్లారగానే ముందుగా మిక్సీ లో ఎండుమిరపకాయలు , తడిపిన చింతపండు , పచ్చిమిరపకాయలు , మరియు తగినంత ఉప్పు వేసి మెత్తగా వేసుకోవాలి .
తర్వాత బీరకాయముక్కలు , కాల్చిన దోసకాయ , మిగిలిన పోపు మరియు కొత్తిమీర వేసి పచ్చడి మెత్తగా వేసుకోవాలి .
తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుని పైన పోపు పెట్టుకోవాలి .
అంతే . ఎంతో రుచిగా ఉండే దోసకాయ బీరకాయ పచ్చడి దోశెలు , గారెలు మరియు భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం .
0 comments:
Post a Comment