నువ్వుల పొడి .
ఈ నువ్వుల పొడి తయారు చేయడానికి తెల్ల నువ్వుపప్పు చాలా రుచిగా ఉంటుంది .
ఈ నువ్వుల పొడి అన్నంలో తినడానికి కాకుండా బెండకాయ , ఆనపకాయ , వంటి కూరల్లో , బంగాళాదుంప , చామ దుంప వంటి వేపుళ్ళ లోను వేసుకుంటే ఎంతో కమ్మగా ఉంటుంది .
నువ్వుపప్పు పొడి తయారీ విధానము .
మొదటి విధానము .
కావలసినవి .
నువ్వుపప్పు -- పావు కిలో
ఎండుమిరపకాయలు - 8
ఉప్పు -- తగినంత .
తయారీ విధానము .
స్టౌ మీద బాండీ పెట్టి నూనె వేయకుండా మీడియం సెగన నువ్వుపప్పు , ఎండుమిరపకాయలు కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి .
చల్లారగానే మిక్సీ లో తగినంత ఉపు వేసుకుని మెత్తగా వేసుకుని ఒక సీసాలో భద్ర పరుచుకోవాలి.
కావలసినప్పుడు అన్నం లోకి కూరల్లోకి తీసుకుని వాడుకోవచ్చును.
ఇలా కొట్టిన నువ్వుపప్పు పొడి పదిహేను రోజులు పైనే నిల్వ ఉంటుంది .
రెండవ విధానము .
స్టౌ మీద బాండీ పెట్టి ముందుగా నువ్వుపప్పు నూనె లేకుండా వేయించుకుని వేరే ప్లేటులో ఉంచుకోవాలి.
తిరిగి స్టౌ మీద బాండి పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి పది ఎండుమిరపకాయలు , 50 గ్రాముల పల్లీలు , రెండు స్పూన్లు మినపప్పు , పావు చిప్ప ఎండు కొబ్బరి ముక్కలు ,రెండు స్పూను ధనియాలు , అర స్పూను జీలకర్ర , అయిదు రెమ్మలు కరివేపాకు వేసి పోపు వేయించుకోవాలి.
పోపు చల్లారగానే మిక్సీ లో
తగినంత ఉప్పు, వేగిన పోపు దినుసులు మరియు వేయించి ఉంచుకున్న నువ్వుపప్పు వేసుకుని మెత్తగా మిక్సీ లో పొడి వేసుకోవాలి .
ఇష్టమైన వారు చివరలో అయిదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేసుకోవచ్చును.
ఈ పొడి కూడా భోజనము లోకి దోశెలలోకి చాలా రుచిగా ఉంటుంది .
0 comments:
Post a Comment