ఆలూరుకృష్ణప్రసాదు .
చిలకడ దుంపల పచ్చడి .
కావలసినవి .
చిలకడ దుంపలు -- పావు కిలో.
ఎండుమిరపకాయలు -- 8
చింతపండు --చిన్న నిమ్మకాయంత
చాయమినపప్పు -- స్పూనున్నర .
మెంతులు -- పావు స్పూను
జీలకర్ర -- పావు స్పూను
ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా
పసుపు -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
కరివేపాకు -- రెండు రెమ్మలు
నూనె -- మూడు స్పూన్లు
తయారీ విధానము .
ముందుగా చిలకడ దుంపలు శుభ్రంగా కడుగుకొని ఎండుకొబ్బరి కోరాముతో తురుముకొని ఒక ప్లేటులో విడిగా తీసుకోవాలి .
దానిపై పసుపు వేసుకుని ఉంచుకోవాలి .
చింతపండు విడదీసుకుని కొద్దిగా నీళ్ళతో తడుపుకుని ఉంచుకోవాలి.
స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు , మెంతులు , చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు వేయించుకోవాలి .
పోపు చల్లారగానే ముందుగా మిక్సీ లో వేయించిన ఎండుమిరపకాయలు , ఉప్పు వేసి మెత్తగా వేసుకోవాలి.
తర్వాత చింతపండు , మిగిలిన పోపు మిక్సీలో వేసి మెత్తగా వేసుకోవాలి .
తర్వాత తురిమి ఉంచుకున్న చిలకడ దుంపల తురుము అందులో వేసి నాలుగు మూలలా కలిసే విధముగా స్పూనుతో కలిపి , వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
చిలకడ దుంపలో తీపి స్వతహాగా ఉంటుంది కనుక వేరేగా తీపి అవసరం లేదు.
తురుమకుండా చిన్న చిన్న ముక్కలుగా తరుగుకొని పై విధముగా పోపు వేసుకుని మిక్సీ లో మెత్తగా వేసుకుని కూడా చేసుకొనవచ్చును .
పచ్చిమిరపకాయలు , కొత్తిమీర వేయనవసరం లేదు .
అంతే ఎంతో రుచిగా ఉండే చిలకడ దుంపల పచ్చడి భోజనము లోనికి సర్వింగ్ కు సిద్ధం .
0 comments:
Post a Comment