ఆలూరుకృష్ణప్రసాదు .
వామన చింతకాయలు కొబ్బరి పచ్చడి.
కావలసినవి .
వామన చింతకాయలు --- పావు కిలో
పచ్చి కొబ్బరి -- ఒక చిప్ప
పచ్చిమిరపకాయలు -- పది
పసుపు -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
కొత్తిమీర -- ఒక కట్ట
పోపునకు .
నూనె -- ఐదు స్పూన్లు
ఎండుమిరపకాయలు -- 8
మెంతులు -- పావు స్పూను
మినపప్పు -- స్పూనున్నర
జీలకర్ర -- పావు స్పూను
ఆవాలు -- అరస్పూను
ఇంగువ -- కొద్దిగా
కరివేపాకు -- మూడు రెమ్మలు.
తయారీ విధానము .
ముందుగా వామన చింతకాయలు ఒకసారి కడిగి ఈనెలు ఉంటే తీసుకుని చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
ఒక పచ్చి కొబ్బరి చిప్ప తీసుకుని చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు , మెంతులు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ , పచ్చిమిరపకాయలు మరియు కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి .
ఇప్పుడు మిక్సీ లో ముందుగా చింతకాయ ముక్కలు , పసుపు , ఉప్పు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
మళ్ళీ మిక్సీ లో ఎండుమిరపకాయలు , పచ్చిమిరపకాయలు , పచ్చి కొబ్బరి ముక్కలు , మరి కాస్త ఉప్పు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి.
వేరేగా తీసి ఉంచిన చింతకాయల తొక్కును కూడా మిక్సీ లో వేసి అన్నీ కలిసే విధంగా మిక్సీ వేసుకోవాలి .
చివరగా మిగిలిన పోపు మరియు కొత్తిమీర కూడా వేసి ఒకసారి మిక్సీ వేసుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
అంతే ఇడ్లీ , దోశెలు , చపాతీలు మరియు భోజనము లోకి ఎంతో రుచిగా ఉండే చింతకాయ కొబ్బరి పచ్చడి సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment