Sunday, November 12, 2017

మామిడి అల్లం పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు  .
*************************

మామిడి   అల్లం   పచ్చడి .

తయారీ  విధానము  .

స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు  నూనె  వేసి   పది  ఎండుమిరపకాయలు  ,  అర స్పూను  మెంతులు ,  స్పూనున్నర  మినపప్పు  ,  స్పూను  ఆవాలు , రెండు  రెమ్మలు  కరివేపాకు మరియు  ఎనిమిది   పచ్చి  మిరపకాయలు   వేసి  వేయించుకోవాలి .

నిమ్మ కాయంత  చింతపండు  షుమారు 50 గ్రాములు  విడదీసి   చాలా  కొద్ది  నీళ్ళలో   తడిపి  ఉంచుకోవాలి  .

ఒక  50  గ్రాముల  మామిడి  అల్లం  పై చెక్కు తీసుకుని   ముక్కలుగా  చేసుకుని  సిద్ధం  చేసి  ఉంచుకోవాలి .

ఇప్పుడు  మిక్సీ లో   సరిపడా  ఉప్పు , వేయించిన ఎండుమిరపకాయలు   ,  కొద్దిగా  పసుపు ,  వేసి మెత్తగా మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత  మిగిలిన  పోపు  చిన్న ముక్కలు  గా  తరిగిన  మామిడి  అల్లం  , చింతపండు కొద్దిగా  నీళ్ళతో  ,   చాలా  కొంచెం   బెల్లం    మిక్సీ లోవేసి  మెత్తగా వేసుకోవాలి.

ఆ తర్వాత  వేరే  గిన్నెలోకి    తీసుకోవాలి .

ఈ  మామిడి  అల్లం  పచ్చడి  ఇడ్లీ  , దోశెలు  ,  చపాతీలు  మరియు  అన్నం  లోకి  అన్నిటిలోకి  కూడా  చాలా రుచిగా  ఉంటుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి