సొరకాయ పచ్చి కొబ్బరి పెరుగు పచ్చడి.
ఆలూరి కృష్ణ ప్రసాద్
ఈ పెరుగు పచ్చడి తయారు చేయడానికి లేత సొరకాయ అయితే బాగుంటుంది .
కావలసినవి .
లేత సొరకాయ చిన్నది --
పై చెక్కు తీసి రెండు కప్పులకు సరిపడా ముక్కలు సన్నగా తరుగుకొని సిద్ధం చేసుకోవాలి .
పచ్చి కొబ్బరి తురుము - ఒక కప్పు .
పచ్చి మిరపకాయలు - ఆరు
అల్లం -- చిన్న ముక్క .
కరివేపాకు -- మూడు స్పూన్లు
కొత్తిమీర --- ఒక కట్ట .
పసుపు -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
జీలకర్ర --- స్పూను
నూనె --- మూడు స్పూన్లు
పోపు కు కావలసినవి .
నెయ్యి -- మూడు స్పూన్లు
ఎండు మిర్చి --- మూడు
మినపప్పు --- స్పూను
మెంతులు -- పావు స్పూను
ఆవాలు --- అర స్పూను
ఇంగువ --- కొద్దిగా
తయారి విధానము .
ముందుగా పచ్చిమిర్చి మరియు అల్లం కొంచెం నలిగేటట్లు మిక్సీ వేసుకోవాలి .
ఒక గిన్నెలో కమ్మని అర లీటరు పెరుగు తీసుకొని గరిటతో బాగా కలుపుకోవాలి .
అందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి .
స్టౌ మీద బాండి పెట్టి రెండు స్పూన్ల నూనె వేసి నూనె బాగా కాగాక స్పూను జీలకర్ర , మూడు రెమ్మల కరివేపాకు వేసి అందులో పై చెక్కు తీసి ముందుగా సన్నగా తరిగి సిద్ధంగా ఉంచుకున్న రెండు కప్పుల సొరకాయ ముక్కలు వేసి మూతపెట్టి మెత్తగా మగ్గ నివ్వాలి.
చల్లారాక మగ్గిన సొరకాయ ముక్కల్ని పెరుగులో కలపాలి .
కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా అందులో కలపాలి .
అల్లం పచ్చి మిర్చి మిశ్రమం అందులో కలపాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్ల నెయ్యి వేసి
ఎండు మిర్చి , మినపప్పు , మెంతులు , ఆవాలు , ఇంగువ వేసి పోపు పెట్టుకుని పెరుగులో కలపాలి .
కొత్తిమీర కడిగి కట్ చేసుకొని పెరుగు లో వేసి అన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి .
అంతే సొరకాయ పచ్చి కొబ్బరి పెరుగు పచ్చడి సర్వింగ్ కు సిద్ధం .
ఈ పచ్చడి అన్నం లోకే కాక రైతా లాగా చపాతీలలో కూడా చాలా రుచిగా ఉంటుంది .
0 comments:
Post a Comment