Saturday, June 10, 2017

దొండకాయ వేపుడు కారం

దొండకాయ  వేపుడు కారం.
ఆలూరు కృష్ణప్రసాదు .


కాయల  పళంగా .
లేత  చిన్న  దొండకాయలు  ఒక అర  కిలో  తీసుకుని  నీళ్ళలో  కడిగి  కాయను  నాలుగు   పక్షాలుగా చేసుకోవాలి .
స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు   నూనె వేసి  నూనె  బాగా కాగగానే   పదిహేను  ఎండు మిరపకాయలు  , పులుసు  గరిటెడు  పచ్చి శనగపప్పు ,  గరిటెడు  మినపప్పు  , స్పూనున్నర జీలకర్ర   వేసి  కమ్మని  వేపు వచ్చే వరకు  వేయించుకుని  చల్లారగానే  తగినంత   ఉప్పు వేసి  మిక్సీ లో  కొంచెం   బరకగా  మిక్సీ   వేసుకోవాలి .
ఈ  కారం  వేరే  పళ్ళెంలోకి  తీసుకుని  కాయలలో  కూరుకోవాలి .
కాస్త కారం  చివరలో  కలిపేందుకు  విడిగా ఉంచుకోవాలి .
ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టుకొని  ఓ  100  గ్రాముల  నూనె  వేసి , నూనె  బాగా కాగగానే  కారం  కూరిన  దొండ కాయలు  నూనెలో  వేసుకుని   మీడియం  సెగన  పైన  నీళ్ళ  మూత  పెట్టి , మధ్య  మధ్యలో  కదుపుతూ  బాగా  మగ్గనివ్వాలి .
చివరలో  మూత  తీసి  విడిగా   ఉంచుకున్న   పొడి  వేసి  మరో  అయిదు  నిముషాలు  వేగనిచ్చి  దింపుకోవాలి .
అంతే .   ఎంతో రుచికరమైన  కాయల  పళంగా  దొండకాయ  వేపుడు  కారం  కూర  సర్వింగ్ కు  రెడీ .
ఫోటో  ---    మా  ఇంట్లో  చేసిన  దొండకాయ  వేపుడు  కారం  కూర .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి