Thursday, June 1, 2017

మసాలా మజ్జిగ .

మసాలా మజ్జిగ .
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

వేసవి కాలం దివ్యౌషధం...చల్ల చల్లని అల్లం కొత్తిమీర మసాలా మజ్జిగ .
తయారు చేయు విధానము .
ఒక లీటరు పాలు బాగా కాచి రాత్రి కుండలో తోడు వేసుకుంటే ( రూ .50 /- పాలు ) ఉదయానికి పెరుగు చక్కగా 
తోడుకుంటుంది .

ఆ కుండలో పెరుగు కవ్వంతో గిల కొట్టుకొని , పల్చగా మూడు లీటర్ల నీళ్ళు అందులో పోసుకోవచ్చు.
అందులో తగినంత ఉప్పు వేయాలి .
కొద్దిగా లేత దబ్బాకులు ఒక ఐదారు వేయాలి.
లేత కరివేపాకు రెమ్మలు మూడు కడిగి దూసి అందులో వేయాలి .
పావు స్పూను జీరాపొడి కాని , శొంఠి పొడి కాని అందులో వేసుకోండి.
ఒక్క పచ్చి మిరపకాయ , చిన్న అల్లం ముక్క , ఒక కట్ట కొత్తిమీర కొంచెం పచ్చడి బండతో కచ్చా పచ్చాగా దంచి మజ్జిగ లో కలిపి , కుండ చుట్టూ తడి బట్ట కప్పండి .
రెండు నిమ్మకాయలు చక్కలుగా కోసి ఆ రసం అందులో పిండండి.
మిట్ట మధ్యాహ్నము దాహంగా ఉన్నప్పుడు , ఎండలో తిరిగి తిరిగి అలసి సొలసి వచ్చిన వారికి ఈ అల్లం కొత్తిమీర మజ్జిగ గరిటతో బాగా కలిపి ఒక గ్లాసు ఇచ్చారా !
ఇక వేసవితాపం దాహార్తి మటుమాయం.
దీనికి సాటి వేసవి పానీయం లేదు . వందలు వందలు తగలేసి తాగుతున్న కూల్ డ్రింక్స్ ఈ చల్లని మజ్జిగ ముందు బలాదూర్ !
కనీసం 20 గ్లాసుల మజ్జిగ అందరికీ సర్వ్ చేయడానికి అవుతుంది .
కుండలో చేసుకునే సౌకర్యము లేని వారు గిన్నెలో చేసుకుని ఫ్రిజ్ లో పెట్టుకోండి .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి