దోసకాయ పచ్చిశనగపప్పు కూర.
ఆలూరు కృష్ణ ప్రసాద్
ముందుగా రెండు దోసకాయలు పై చెక్కు తీసుకొని ముక్కలుగా తరుగు కోవాలి .
పావు కప్పు పచ్చిశనగపప్పు , మరియు తరిగిన దోసకాయ ముక్కలు ఒక గిన్నెలో వేసి ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసి ముక్కలు మరియు శనగపప్పు మెత్త పడేవరకు ఉడకనివ్వాలి .
ఉప్పు వేయకుండా ఉడకనివ్వాలి
ఉడకగానే నీళ్ళు వడ కట్టుకుని ముక్కలపై కొద్దిగా పసుపు వేసుకోవాలి .
పది పచ్చిమిరపకాయలు తొడిమలు తీసి నిలువుగా తరుగు కోవాలి .
కరివేపాకు మూడు రెమ్మలు సిద్ధంగా ఉంచుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి నాలుగు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా నాలుగు ఎండు మిర్చి ముక్కలుగా చేసినవి , స్పూను మినపప్పు , పావు స్పూను జీలకర్ర , అర స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ వేసి పోపు వేసుకోవాలి .
పోపు వేగగానే తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా వేసి వేగ నివ్వాలి .
తర్వాత ఉడికిన దోసకాయ శనగపప్పు మిశ్రమం కూడా వేసి , తగినంత ఉప్పువేసి ఒక అయిదు నిముషాలు మూత పెట్టి మగ్గ నివ్వాలి .
తర్వాత దింపుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
పచ్చి మిర్చి సరిపడా వేసాము కనుక వేరుగా ఎండు కారం వేయనవసరం లేదు .
చూసి అవసరమైతే వేసుకోండి .
దోసకాయలో పులుపు ఉంటుంది కనుక చింతపండు రసం కూడా వేయనవసరం లేదు .
మీకు ఇష్ట మైతే వేసుకోండి .
అంతే ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చిశనగపప్పు కూర అన్నం లోకి రోటి ల లోకి సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment