సుండల్.
ఆలూరి కృష్ణ ప్రసాద్
ఒక 150 గ్రాముల బొంబాయి శనగలు ఉదయమే నిద్ర లేవగానే ఒక గిన్నెలో తగినన్ని నీళ్ళు పోసి ఒక అయిదు గంటల పాటు నానపెట్టండి .
తర్వాత నీళ్ళు వడగట్టి కొద్దిగా ఉప్పువేసి తగినంత నీరు పోసి కుక్కర్ లో రెండు విజిల్స్ రానిచ్చి ఆపి వడగట్టు కోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే రెండు ఎండుమిర్చి ముక్కలుగా చేసి , అర స్పూను జీలకర్ర , స్పూను పచ్చిశనగపప్పు , స్పూను మినపప్పు , స్పూను ఆవాలు రెండు రెబ్బలు కరివేపాకు వేసి పోపు వేగగానే ఈ ఉడికిన శనగలు వేసి మూత పెట్టి మగ్గ నివ్వాలి .
రెండు పచ్చిమిర్చి , కాస్త పచ్చి కొబ్బరి, ఉప్పు , అర స్పూను కారం కొద్దిగా కచ్చాపచ్చాగా తొక్కుకొని , అందులో స్పూను బియ్యపు పిండి కలిపి ఆ మిశ్రమాన్ని మగ్గుతున్న శనగలు లో వేసి మరో మూడు నిముషములు పచ్చి వాసన పోయేదాకా ఉంచి దింపుకొని పైన తరిగినకొత్తిమీర చల్లుకోవాలి .
అంతే వేడి వేడి సుండల్ మీ కోసం మధ్యాహ్నపు అల్పాహారానికి సిద్ధం.
0 comments:
Post a Comment