మినప సున్నుండలు .
ఆలూరు కృష్ణప్రసాదు .
తయారీ విధానము .
ఒక కె. జి . మినప గుళ్ళు ( పొట్టు లేనివి ) బాండీ లో నూనె వేయకుండా కమ్మని వాసన వచ్చే దాకా వేయించుకోవాలి .
ఆ తర్వాత మిక్సీ లో గాని లేదా పిండి మరలో గాని మెత్తని పొడిగా వేసుకుని ఆ పొడి డబ్బాలో పోసుకుని గట్టిగా మూత పెట్టు కోవాలి .
మనం ఎప్పుడు మినప సున్నుండలు చేసుకోవాలని అనుకుంటే అప్పుడు కప్పు మినప సున్నికి అర కప్పు బాగా మెత్తగా దంచిన బెల్లపు పొడి గాని , మెత్తగా గ్రైండ్ చేసిన పంచదార కాని పొడిలో వేసి బాగా చేత్తో కలుపు కోవాలి .
షుమారు పావు కప్పు బాగా కాగిన వేడి వేడి కల్తీ లేని మంచి నెయ్యి పిండిలో పోసుకుంటూ చేత్తో గట్టిగా ఉండలు కట్టు కోవాలి .
బాలింతలకు కూడా నడుము గట్టి పడుతుందని ఈ సున్నుండలు పెడతారు .
పెద్ద, చిన్న , పిల్లలూ అందరూ ఎంతో ఇష్టంగా తినే మినప సున్నుండలు రెడీ .
ఒక్కసారి ఎక్కువ మోతాదులో కలుపుకునే కన్నా మన ఇంట్లో జనాన్ని బట్టి కాస్త కాస్త కలుపుకుంటే తాజా తాజా గా ఉంటాయి .
0 comments:
Post a Comment