మసాల వడ.
ఆలూరి కృష్ణ ప్రసాద్
తయారీ విధానము .
మూడు గంటల ముందు ఒక గ్లాసు పచ్చిశనగపప్పు , అర గ్లాసు పెసర పప్పు తగినన్ని నీరు పోసి విడిగా నానబెట్టుకుని , తర్వాత నీరు వడ కట్టు కోవాలి .
తర్వాత మిక్సీలో ఈ నాన బెట్టిన పప్పులు , ఎనిమిది పచ్చి మిరపకాయలు , చిన్న అల్లంముక్క, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు , పావు స్పూను జీలకర్ర , పావు కప్పు పొదీనా ఆకు , రెండు రెమ్మలు కరివేపాకు , కొద్దిగా కొత్తిమీర , అర స్పూను కారం , తగినంత ఉప్పు, వేసి తగినన్ని నీళ్ళు పోసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ వేసుకోవాలి .
ఆ తర్వాత ఈ మిశ్రమంలో ఒక స్పూను బియ్యపు పిండి కలుపు కోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి పావు కేజి నూనె పోసి నూనె బాగా కాగగానే ఆకు మీద వడల్లా తట్టి నూనె లో వేసుకొని బంగారు రంగు వచ్చే విధంగా వేయించు కోవాలి .
అంతే వేడి వేడి మసాల వడ రెడి .
ఈ మసాలా వడ టిఫిన్ గాను మరియు వేడి వేడి అన్నంలో ఆదరువు గాను పనికొస్తుంది.
0 comments:
Post a Comment