తప్పాల రొట్టెలు.
ఆలూరి కృష్ణ ప్రసాద్
కావలసినవి.
బియ్యపు పిండి --- నాలుగు కప్పులు.
పచ్చిశనగపప్పు --- పావు కప్పు.
చాయ పెసర పప్పు --- పావు కప్పు
జీలకర్ర --- స్పూను
నువ్వు పప్పు -- రెండు స్పూన్లు
రెండు ఉల్లిపాయలు -- సన్నగా ముక్కలు గా కట్ చేసుకోవాలి.
కరివేపాకు --- రెండు రెమ్మలు
ఉప్పు --- తగినంత
కొత్తిమీర --- ఒక కట్ట సన్నగా తరుగు కోవాలి .
తయారి విధానము.
ముందుగా పచ్చి శనగపప్పు , చాయ పెసర పప్పు ఓ రెండు గంటల పాటు విడిగా నీళ్ళల్లో నాన బెట్టు కోవాలి .
ఒక పళ్ళెంలో బియ్యపు పిండి , నువ్వు పప్పు , నానబెట్టిన పచ్చిశనగపప్పు , చాయ పెసర పప్పు, జీలకర్ర , తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు , పచ్చి మిర్చి ముక్కలు , తరిగిన కొత్తిమీర , కరివేపాకు , తగినంత ఉప్పువేసి అందులో తగినన్ని నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండి కన్నా పల్చగా కలుపుకోవాలి .
తర్వాత ఒక స్టీల్ గిన్నె కాని, బాండి కాని బోర్లించి దాని చుట్టూ నూనె రాసి కలిపిన పిండి చుట్టూ వేసి చేతితో వత్తుకుంటూ మధ్యలో వేలితో చిన్న చిన్న కన్నాలు చేసుకోవాలి.
తర్వాత స్టౌ వెలిగించి పెనం పెట్టి నూనె వేసుకుని
వత్తిన తప్పాల రొట్టెలు ఒక్కొక్కటి కాల్చుకోవాలి.
అంతే తప్పాల రొట్టెలు వేడి వేడిగా సిద్ధం.
ఇవి వేడిగా టొమాటో చట్నీతో తింటే బాగుంటాయి.
0 comments:
Post a Comment