Wednesday, June 14, 2017

చేగోడీలు

చేగోడీలు  తయారీ  విధానము .
ఆలూరి కృష్ణ ప్రసాద్ 


ఒక  గిన్నెలో  గ్లాసు నీళ్ళు  పోసి , అందులో       రెండు స్పూన్లు   పెసరపప్పు   కొద్దిగా  జీలకర్ర  వేసి  నీళ్ళు  బాగా  తెర్లి  కొద్దిగా  పెసరపప్పు  బద్దలుగా  ఉడికాక  ,  ఒక  చెమ్చా  నూనె ,  కొద్దిగా  ఉప్పు ,
ఒక గ్లాసు  ( బియ్యము  మెత్తగా  మర పట్టించిన )  బియ్యపు  పిండి  అందులో  వేసి   కలిపి  స్టౌ ఆపి  కిందకి  దింపి   మళ్ళీ ఒక చెమ్చా  నూనె  వేసి  బాగా  కలుపుకోవాలి .
చేతికి  నూనె  రాసుకుని  నూనె చెయ్యి  చేసుకొని   సన్నగా   పొడవుగా   పీటపై  రోల్  చేసుకొని   అన్నీ  గుండ్రంగా   చేగోడీల  ఆకారంలో  చుట్టుకోవాలి .
మళ్ళీ  స్టౌ  వెలిగించి   బాండీ  పెట్టీ  పావు  కేజీ  నూనె  వేసి  నూనె  బాగా  కాగాక  అయిదారు  బంగారు  రంగు  వచ్చేదాకా  వేయించుకుని  తీసుకోవాలి .
కొంతమంది  పెసరపప్పుతో  పాటు  శనగపప్పు   కూడా  నానబెట్టి   కూడా  కలుపు కుంటారు .
కొంతమంది  రుచిగా  ఉంటుందని  తెల్ల  నువ్వుపప్పు  కలుపుతారు .
పిండిలో  వేడి  వేడి  నీళ్ళు పోసి  కలిపితే  ఆకాశం  ఎత్తున  పేలే  ప్రమాదం ఉంది.  
మాకు  ఒకసారి  ఆ అనుభవం  అయ్యింది .
 అందుకని  ఉడకపెట్టి  చేసుకుంటాము. 
ఎంత  ఎర్రగా   వేయించినా  రెండు రోజులు  మించి  నిల్వ  ఉండవు .
కర కర లాడుతూ  పసందుగా  తినాలంటే  అప్పటికప్పుడు   వేడి వేడిగానే  తినాలి.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి