చింత చిగురుతో కూర
ఆలూరి కృష్ణ ప్రసాద్
చింత చిగురుతో కూర ఏ విధంగా చేసుకోవాలో మీకు ఈ రోజు తెలియ చేస్తాను .
చింత చిగురు ఉల్లిపాయ కూర .
కావలసినవి .
లేత చింత చిగురు --- 200 గ్రా.
పెద్ద ఉల్లిపాయలు --- 5
ఉప్పు --- తగినంత
కారం --- ఒకటిన్నర స్పూను
పసుపు -- కొద్దిగా
పోపుకు.
ఎండుమిరపకాయలు -- 4
మినపప్పు -- ఒకటిన్నర స్పూను
పచ్చి శనగపప్పు -- ఒకటిన్నర స్పూను
జీలకర్ర -- పావు స్పూను
ఆవాలు -- అర స్పూను
కరివేపాకు -- కొద్దిగా
నూనె -- 4 స్పూన్లు
తయారీ విధానము .
ముందుగా చింత చిగురు బాగా రెండు అర చేతుల్తో నలుపుకొని ఆకు విడిగా తీసుకోవాలి.
ఈనెలు పారేయండి .
తర్వాత ఉల్లిపాయలు పై పొట్టు తీసుకొని ముక్కలుగా తరుగు కోవాలి .
తర్వాత స్టౌ వెలిగించి బాండీ పెట్టి మొత్తము నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిర్చి ముక్కలు , పచ్చి శనగపప్పు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , కరివేపాకు , కొంచెం ఇంగువ వేసి పోపు వేగగానే తరిగిన ఉల్లిపాయ ముక్కలు , పసుపు , ఉప్పువేసి బాగా మగ్గ నివ్వాలి .
తర్వాత సిద్ధంగా ఉంచుకున్న చింత చిగురు , స్పూనున్నర కారం వేసి మరో అయిదు నిముషాలు బాగా మగ్గ నివ్వాలి .
ఆ తర్వాత దింపి వేరే గిన్నె లోకి తీసుకోవాలి .
ఈ కూర పుల్ల పుల్ల గా చింత చిగురు రుచితో , ఉల్లిపాయల కమ్మదనంతో చాలా రుచిగా ఉంటుంది .
ఈ కూర అన్నం లోకి మరియు రోటీల లోకి బాగుంటుంది .
0 comments:
Post a Comment