Thursday, June 1, 2017

పచ్చి కొబ్బరి పెరుగు పచ్చడి.

పచ్చి కొబ్బరి పెరుగు పచ్చడి.
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

కావలసినవి.
పెరుగు -- అర లీటరు .
కొబ్బరి కాయ -- ఒకటి
పచ్చి మిర్చి --- మూడు
అల్లం -- చిన్న ముక్క
కొత్తిమీర - ఒక కట్ట
ఉప్పు -- తగినంత

పోపుకు.
నెయ్యి -- మూడు స్పూన్లు 
ఎండుమిర్చి -- మూడు . ( ముక్కలుగా చేసుకోవాలి . )
మినపప్పు -- స్పూను 
జీలకర్ర -- పావు స్పూను 
శనగపప్పు -- స్పూను
ఆవాలు -- అర స్పూను 
కరివేపాకు -- రెండు రెమ్మలు .

తయారీ విధానము .
కొబ్బరి కాయ కొట్టి రెండు చిప్పలు కోరాముతో తురుముకోవాలి.
ఒక గిన్నెలో పెరుగు వేసుకుని అందులో అల్లం పచ్చిమిర్చి దంచి వేసుకోవాలి .
తురిమిన కొబ్బరి పెరుగులో కలపాలి.
తగినంత ఉప్పు అందులో కలపాలి .
కొత్తిమీర సన్నగా తరిగి అందులో కలుపు కోవాలి.
ఇప్పుడు గరిటతో అన్నీ బాగా కలుపు కోవాలి .
తర్వాత స్టౌ వెలిగించి బాండీ పెట్టి నెయ్యి వేసి పోపు పెట్టుకోవాలి.
పెరుగు కమ్మగా ఉంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది .
కొబ్బరి మరీ ముదిరితే బాగుండదు.
కాయ మధ్యస్థంగా ఉండాలి
అంతే అన్నం లోకి ఇడ్లీ దోశెల లోకి రుచికరమైన కొబ్బరి పెరుగు పచ్చడి సర్వింగ్ కు రెడీ.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి