Wednesday, June 7, 2017

మెంతి వంకాయ కూర.

మెంతి  వంకాయ కూర.
ఆలూరి కృష్ణ ప్రసాద్ 



కావలసిన  పదార్థములు.

చిన్నవి  గుండ్రని  వంకాయలు  ---
అర కిలో

పచ్చి శనగపప్పు  --  30  గ్రాములు

చాయ  మినపప్పు  -  20  గ్రాములు .

మెంతులు  ---  మూడు  టీ  స్పూన్లు .

జీలకర్ర  --  అర  స్పూను 

ఆవాలు  --  పావు  స్పూను 

ఇంగువ  --  కొద్దిగా 

ఎండు మిరపకాయలు  --  15

ఉప్పు  ---  తగినంత 

పసుపు  --  కొద్దిగా 

నూనె  --   150  గ్రాములు .

తయారు  చేయు విధానము .

ముందుగా  స్టౌ  వెలిగించి  బాండి  పెట్టి  నాలుగు  స్పూన్లు  నూనె వేసి 
ముందుగా  మెంతులు , ఎండు మిరపకాయలు , పచ్చి శనగపప్పు  , చాయ మినపప్పు , జీలకర్ర  , ఆవాలు ,  ఇంగువ  వేసి  మెంతులు  పచ్చి వాసన  పోయి  ,
పోపు  కమ్మని  వాసన  వచ్చేదాకా  వేయించు కోవాలి.

పోపు  చల్లారిన  తర్వాత  మిక్సీలో  ఈ  పోపు , కాస్త పసుపు , తగినంత  ఉప్పు వేసి  కొంచెము  పప్పులు  పంటికి  తగిలే  విధముగా  మిక్సీ  వేసుకోవాలి .

వంకాయలు  కాయలు  పుచ్చులు  లేకుండా  చూసుకుని  , శుభ్రంగా  కడిగి  నాలుగు  పక్షాలుగా  చేసుకోవాలి .

ముందుగా   సిద్ధం  చేసుకున్న  కూర  పొడి   కాయల్లో  కూరు కోవాలి .

చివరలో కూర   దించబోయే  ఐదు నిముషాలు  ముందు  పైన  జల్లు కోవడానికి  కాస్త  పొడి  విడిగా  ఉంచుకోవాలి .

మళ్ళీ  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మిగిలిన  నూనె  అంతా పోసి  నూనె  బాగా  కాగాక  పొడి   కూరిన  వంకాయలు  వేసి  మీడియం  సెగన  వంకాయలు  మగ్గి  పొడి  వేగే  దాకా  మధ్య మధ్యలో  అట్లకాడతో  తిరగవేస్తూ
కలుపుతూ  ఉండాలి .
దింప  బోయే   అయిదు  నిముషాల ముందు  మిగిలిన పొడి  వేసి  వేగాక   దించుకుని , వేరే  డిష్ లోకి  తీసుకోవాలి .


అంతే  ఘమ ఘమ లాడే  మెంతి  వంకాయ కూర  సర్వింగ్  కు  సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి