Wednesday, June 14, 2017

సాంబారు ముద్ద తయారి

సాంబారు  ముద్ద  తయారీ  విధానము .
ఆలూరి కృష్ణ ప్రసాద్ 


కావలసినవి .
ఎండుమిరపకాయలు  -  4
పచ్చి శనగపప్పు  --  మూడు  స్పూన్లు .
ధనియాలు  ---  మూడు స్పూన్లు 
జీలకర్ర   --  పావు  స్పూను 
బియ్యం  --  రెండు స్పూన్లు 
మిరియాలు  --  6
ఇంగువ  --  కొద్దిగా 
ఎండు కొబ్బరి  --పావు  చిప్ప 
చిన్న  ముక్కలుగా   కట్  చేసుకోవాలి.
నూనె  --   నాలుగు   స్పూన్లు .
తయారీ  విధానము .
స్టౌ  వెలిగించి   బాండి  పెట్టి  నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే  వరుసగా  ఎండుమిర్చి , శనగపప్పు ,ధనియాలు, జీలకర్ర , మిరియాలు , ఇంగువ , ఎండు కొబ్బరి ముక్కలు  వేసి  ఎర్రగా  వేయించు కోవాలి .
చివరగా  బియ్యము   వేసి  ఒక  నిముషము  సేపు  ఉంచి  దించుకోవాలి .
చల్లారాక  మిక్సీలో  ఈ  దినుసులన్నీ  వేసుకుని   మెత్తగా   పొడిలా  వేసుకోవాలి .
మేము  తగినన్ని  నీళ్ళుపోసి   దానిని  మెత్తగా   ముద్దలా  చేసుకుంటాము .
పులుసుకు  బాగా  పడుతుందని  ముద్దుగా  వేస్తాము .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి