కరివేపాకు పచ్చడి.
ఆలూరు కృష్ణప్రసాదు .
తయారీ విధానము .
రెండు కప్పుల కరివేపాకు , 75 గ్రాముల పొట్టు మినపప్పు , పది ఎండుమిరపకాయలు , అర స్పూను ఆవాలు , ఇంగువ కొద్దిగా నాలుగు స్పూన్లు నూనె వేసి వేయించుకోండి .
నిమ్మకాయంత చింతపండు వేడి నీళ్ళలో పావు గంట నాన బెట్టు కొని చిక్కగా రసం తీసుకోండి .
పోపు చల్లారగానే మిక్సీ లో ముందు వేగిన ఎండుమిరపకాయలు , తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి తిప్పి , ఆ తర్వాత పొట్టు మినపప్పు కరివేపాకు మిశ్రమం , చింతపండు రసం , ఇష్టమైతే కొద్దిగా బెల్లం వేసుకుని కొంచెం నీరు అవసరమైతే పోసుకుని పప్పులు గా వేసుకుంటే కరివేపాకు పచ్చడి బాగుంటుంది .
పొట్టు మినపప్పే వాడండి.
చాయమినపప్పు తో పచ్చడి రుచిగా ఉండదు .
0 comments:
Post a Comment