ఆలూరుకృష్ణప్రసాదు .
పచ్చిబఠాణీ కొబ్బరి కూర.
కావలసినవి .
పచ్చి బఠాణీ గింజలు -- బఠాణీ కాయలు ఒక పావు కిలో కొని వలుచు కొని ఒక కప్పు పచ్చి బఠాణీ గింజలను సిద్ధం చేసుకోవాలి . లేదా frozen బఠాణీ గింజలను కూడా వాడ వచ్చును .
పచ్చి కొబ్బరి తురుము -- అర కప్పు
మినపప్పు -- స్పూను
జీలకర్ర -- పావు స్పూను
ఆవాలు -- అర స్పూను
పచ్చిమిర్చి -- మూడు చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
కరివేపాకు -- రెండు రెమ్మలు .
ఇంగువ -- కొద్దిగా
నూనె -- రెండు స్పూన్లు
ఉప్పు -- తగినంత
కారం -- అర స్పూను .
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు ముక్కలు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ , కరివేపాకు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి పోపు వేగగానే వలిచిన పచ్చి బఠాణీలు కూడా పోపులో వేసుకుని అర కప్పు నీరు పోసి మూతపెట్టి బఠాణీలను అయిదు నిముషములపాటు నీరు ఇగిరి పోయే వరకు సన్నని సెగన మగ్గ నివ్వాలి .
తర్వాత అర కప్పు పచ్చి కొబ్బరి తురుము , అర స్పూను కారం , తగినంత ఉప్పువేసి కొబ్బరి పచ్చి వాసన పోయే వరకు ఉంచి దింపి వేరే గిన్నెలో కి తీసుకోవాలి .
అంతే వేడి వేడి పచ్చి బఠాణి కొబ్బరి కూర భోజనము లోకి , రోటీలు మరియు చపాతీల లోకి సర్వింగ్ కు సిద్ధం.