Thursday, June 1, 2017

తోటకూర అల్లం పచ్చి మిర్చి కూర.

తోటకూర అల్లం పచ్చి మిర్చి కూర.
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

కావలసినవి .
లేత తోటకూర కట్టలు -- మూడు
అల్లం --- రెండు అంగుళాల ముక్క .
పచ్చి మిర్చి -- కారాన్ని బట్టి 8 నుండి పది వరకు.
మినప్పిండి చిన్న వడియాలు -- 15.
ఉప్పు -- తగినంత .

పోపుకు .
నూనె -- 100 గ్రాములు.
ఎండుమిరపకాయలు -- నాలుగు
ముక్కలుగా చేసుకోవాలి
చాయ మినపప్పు -- రెండు స్పూన్లు .
ఆవాలు -- అర స్పూను 
జీలకర్ర -- పావు స్పూను .

తయారీ విధానము .
ముందుగా తోటకూర శుభ్రంగా ఇసుక లేకుండా ఒకటి రెండు సార్లు కడిగి సన్నగా తరుగు కోవాలి .
కాడలు లేతగా ఉన్నవి కూడా కలిపి తరగ వచ్చు.
తరిగిన కూర వేరే పెట్టుకోవాలి .
అల్లం ముక్క పై చెక్కుతీసి ముక్కలుగా కట్ చేసుకొని , పచ్చి మిరపకాయలు ఉప్పు వేసి మిక్సీలో కొంచెం మెత్తగా వేసుకోవాలి .
ఇప్పుడు స్టౌ వెలిగించి బాండీ పెట్టి నూనె పోసి నూనె కాగగానే ముందుగా వడియాలు వేయించి వేరే ప్లేటులో పెట్టుకోవాలి .
ఇప్పుడు అదే నూనెలో ఎండు మిర్చి , చాయ మినపప్పు , జీలకర్ర , ఆవాలు వేసి పోపు పెట్టు కోవాలి .
పోపు వేగగానే అల్లం పచ్చి మిర్చి ముద్ద అందులో వేసి రెండు నిముషాలు పచ్చి వాసన పోయేదాకా వేయించాలి .
తర్వాత తరిగి ఉంచుకున్న తోటకూర అందులో వేసి మూత పెట్టి పది నిముషాలు సన్నని సెగన మగ్గ నివ్వాలి.
తోటకూర మగ్గేటప్పుడు నీళ్ళు స్వతహాగా బయటకు వస్తాయి .
మీరు ప్రత్యేకంగా పోయనవసరం లేదు.
కూర మగ్గి ఇంకా కూరలో నీళ్ళ తడి ఉంటే మూత తీసి మూడు నిముషాలు పాటు మగ్గనిస్తే కూర లో నీరు ఇగిరి పోతుంది .
ఈ కూరలో అల్లం పచ్చి మిర్చి కారం సరిపోతుంది .
వేరే ఎండుకారం వేయకండి . రుచి పాడవుతుంది .
కరివేపాకు , కొత్తిమీర కూడా వేయనవసరం లేదు .
తోటకూర కూర రెడి అయ్యింది .

మనం భోజనం చేసే ముందు పిండి వడియాలు అప్పటికప్పుడు కూరలో కలుపుకుని వడ్డించుకుంటే వడియాలు కర కర లాడుతూ కూర తినేటప్ఫుడు ఎంతో రుచిగా ఉంటుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి