Saturday, June 10, 2017

వెజిటెబుల్ కొబ్బరి కూర

వెజిటెబుల్ కొబ్బరి కూర
                                                                      ఆలూరు  కృష్ణ  ప్రసాదు .


ప్రియమిత్రులారా !
ఈ  రోజు  మీ  అందరికీ  వెజిటబుల్  కొబ్భరి కూర  తయారీ  విధానము  గురించి  తెలియ చేస్తాను.
వెజిటబుల్  కొబ్బరి కూర .
*********************
కావలసినవి  
క్యారెట్లు  ---  రెండు
 బంగాళా దుంపలు  --  రెండు
 క్యాబేజి  ---  100  గ్రా .
కొబ్బరి కాయ  --  ఒకటి
 జీలకర్ర   ---  ఒక స్పూను 
ఎండు మిర్చి  ---  ఏడు 
పచ్చి బఠాణీలు  ---  100 గ్రా .
పసుపు  ---  చిటికెడు 
మినపప్పు   ---  ఒక  చెంచా
ఆవాలు  ---  అర  చెంచా
నూనె  ---  మూడు  స్పూన్లు 
ఉప్పు  ---  తగినంత

కరివేపాకు  ---  నాలుగు  రెబ్బలు .
తయారు  చేయు  విధానము .
క్యారెట్టు, క్యాబేజి ,  బంగాళా దుంపలు  , శుభ్రంగా కడిగి  ముక్కలుగా  తరగాలి .
ఒక  గిన్నెలో  ఈ  ముక్కలు వేసి , అందులో  ఉప్పు , పసుపు వేసి  కుక్కర్  లో  మూడు  విజిల్స్  వచ్చే వరకు  ఉంచి  స్టౌ  ఆపేయాలి.
తర్వాత  కొబ్బరి కాయ కొట్టి  చిన్న 
ముక్కలుగా  చేసుకోవాలి.
ఇప్పుడు  కొబ్బరి ముక్కలు , ఐదు  ఎండు  మిర్చి , జీలకర్ర   ఈ  మూడు  మిక్సీలో  మెత్తగా  వేసుకోవాలి.
ఇప్పుడు  బాండిలో  నూనె  వేసి  బాగా  కాగాక  ఆవాలు  , మినపప్పు ,  మిగిలిన   ఎండు మిర్చి,  కరివేపాకు  వేసి    పోపు  వేగాక  అందులో పచ్చి బఠాణీలు , కూడా  వేసి  మగ్గనివ్వాలి .
ఇప్పుడు  ఉడికిన  బంగాళా దుంపల  మీద  పై తొక్క  తీసుకోవాలి.
ఇప్పుడు  బంగాళాదుంప   ముక్కలు , క్యాబేజి ,  క్యారెట్  ముక్కలు కొద్దిగా  ఉప్పు  వేసి  మగ్గ నివ్వాలి.

ఆ తర్వాత  మిక్సీ  వేసుకున్న  కొబ్బరి  మిశ్రమం   చేర్చి  పచ్చి వాసన  పోయేవరకు  అంటే  రెండు  నిముషాలు  ఉంచి  దింపు కోవాలి.
కేరళ  ప్రాంతం  వారు  ఇదే  పద్దతిలో  చేసినా  నూనె  బదులుగా  కొబ్బరి నూనె ను  వంటలలో  వాడతారు .
కమ్మని  వెజిటబుల్  కొబ్బరి  కూర  సర్వింగ్ కు  సిద్ధం.
ఈ  కూర  అన్నం లోకి  మరియు  చపాతీలలోకి  కూడా  చాలా  బాగుంటుంది.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి